పొగమంచు ఎఫెక్ట్: 1500 రైళ్లు రద్దు

దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని రహదారులపైనా పొగమంచు దట్టంగా ఏర్పడడంతో

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 05:50 AM IST
పొగమంచు ఎఫెక్ట్:  1500 రైళ్లు రద్దు

Updated On : February 5, 2019 / 5:50 AM IST

దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని రహదారులపైనా పొగమంచు దట్టంగా ఏర్పడడంతో

దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని రహదారులపైనా పొగమంచు దట్టంగా ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. హెడ్‌లైట్లు వేసినా రోడ్లు స్పష్టంగా కనబడక అవస్థలు పడుతున్నారు. పొగమంచు ఎఫెక్ట్ రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. ఢిల్లీలో 25రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.  దేశవ్యాప్తంగా 1500 రైళ్లను క్యాన్సిల్ చేశారు. వాతావరణ శాఖ వర్ష సూచన ఇచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానాలలో ఫిబ్రవరి 6, 7వ తేదీల్లో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీలో స్వచ్చమైన గాలి నాణ్యత కూడా తగ్గిపోయింది.

 

* ఢిల్లీలో దట్టంగా అలుముకున్న పొగమంచు
* రైళ్ల రాకపోకలపై ప్రభావం
* ఆలస్యంగా నడుస్తున్న 25రైళ్లు
* MPS క్రాంతి ఎక్స్ ప్రెస్
* నిజాముద్దీన్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్
* కోల్ కతా- రాజధాని ఎక్స్ ప్రెస్
*పాట్నా-రాజధాని ఎక్స్ ప్రెస్
* దేశవ్యాప్తంగా 1500 రైళ్లు క్యాన్సిల్