మోడీ గిఫ్ట్స్ వేలం : 1900 బహుమతులు అమ్మకానికి

డిల్లీ : తమకు బహుకరించిన బహుమతులను కొంతమంది వేరే వారికి ఇస్తుంటారు. ప్రముఖులు అయితే..వచ్చిన గిఫ్ట్‌లను వేలం పాట వేస్తుంటారు. వచ్చిన డబ్బులను విరాళంగా ఇతర సంస్థలకు అందిస్తుంటారు. తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వచ్చిన బహుమతులను వేలం వేశారు. ఇందులో జ్ఞాపికలు, పురస్కారాలున్నారు. జనవరి 27వ తేదీ ఆదివారం వీటిని వేలం వేశారు. ఢిల్లీలోని నేషనల్ గ్యాలంటరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ (ఎన్‌జీఎంఏ) భవనంలో వేలం కొనసాగుతోంది. రెండు రోజుల పాటు ఇది జరుగనుంది. ఫస్ట్ డే మహారాజ ఛత్రపతి శివాజీ విగ్రహం రూ. 22 వేలకు ఒకరు దక్కించుకున్నారు. ఈ వేలంలో వచ్చిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న‘నవామీ గంగే’ ప్రాజెక్టు కోసం ఇవ్వనున్నారు. మొత్తంగా వేలంలో 1900 వరకు బహుమతులుండనున్నాయి. మరి వేలంలో ఎంత డబ్బు వస్తుందో చూడాలి మరి…