Kerala : ఫుట్ బాల్ మ్యాచ్ లో అపశృతి-కూలిన గ్యాలరీ

కేరళ మలప్పురంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతున్న స్టేడియంలో గ్యాలరీ కుప్పకూలడంతో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Kerala : ఫుట్ బాల్ మ్యాచ్ లో అపశృతి-కూలిన గ్యాలరీ

Kerala Foot Ball Match

Updated On : March 20, 2022 / 2:34 PM IST

Kerala :  కేరళ మలప్పురంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతున్న స్టేడియంలో గ్యాలరీ కుప్పకూలడంతో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మలప్పురం జిల్లా పూంగోడ్ లో శనివారం రాత్రి ఆల్ ఇండియా సెవన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. దీన్ని ప్రత్యక్షంగా చూసేందుకు 8000 మంది వచ్చారు. దీంతో స్టేడియం మొత్తం కిక్కిరిసి పోయింది.

గ్యాలరీ సామర్థ్యానికి మించి ప్రేక్షుకులు కూర్చోవడంతో ఒక్కసారిగా అది కూలిపోయింది. దీంతో అందులో కూర్చున్నవాళ్లంతా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో అనేక మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గ్యాలరీ చుట్టుపక్కల మూడు వేల మంది వరకు ఉన్నారు…

సెవన్స్‌ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కావడంతో స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. సరిగ్గా ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్కసారిగా గ్యాలరీ కూలిపోయింది. దీంతో అంతా ఉలిక్కి పడ్డారు. గాయపడ్డ వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.

Also Read : AP Rains : అల్పపీడన ప్రభావంతో ఏపీలో తేలికపాటి వర్షాలు