రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో గ్యాస్ లీక్: 90మందికి అస్వస్థత

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 04:43 AM IST
రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో గ్యాస్ లీక్: 90మందికి అస్వస్థత

Updated On : November 14, 2019 / 4:43 AM IST

ఒడిశాలోని రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయిన ఘటనలో 90మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బుధవారం (నవంబర్ 13, 2019) రాత్రి బాలాసోర్‌ కి 20కిలోమీటర్ల దూరంలోని పన్పానా ప్రాంతంలో ఫాల్కన్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ నడుపుతున్న ప్లాంట్‌ లో ఈ ఘటన జరిగింది. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. 

గ్యాస్ లీక్ గురించి సమాచారం అందుకున్న వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు,అధికారులు బాధితులను బాలాసోర్ హాస్పిటల్ కు తరలించారు. ప్రాసెసింగ్ యూనిట్ లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయిందని ప్రాధమిక అంచనాలో తేలినట్లు  ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అందరికీ శ్వాస ఇబ్బంది,కళ్లల్లో మంటలు వంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. 

ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.అందరి ఆరోగ్య పరిస్థితి కంట్రోల్ ఉందని, కొంతమందిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్లు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక మంత్రి సుశాంత్ సింగ్ తెలిపారు