రైలు ఢీకొని యజమాని మృతి : మృతదేహం పక్కనే కుక్క కాపలా
కుక్క.. విశ్వాసానికి పెట్టింది పేరు. మనిషిని చేరదీస్తే.. విషం కక్కుతాడేమోగానీ కుక్కను పెంచి పోషిస్తే మాత్రం అది విశ్వాసాన్ని మాత్రమే చూపుతుంది.

కుక్క.. విశ్వాసానికి పెట్టింది పేరు. మనిషిని చేరదీస్తే.. విషం కక్కుతాడేమోగానీ కుక్కను పెంచి పోషిస్తే మాత్రం అది విశ్వాసాన్ని మాత్రమే చూపుతుంది.
కుక్క.. విశ్వాసానికి పెట్టింది పేరు. మనిషిని చేరదీస్తే.. విషం కక్కుతాడేమోగానీ కుక్కను పెంచి పోషిస్తే మాత్రం అది విశ్వాసాన్ని మాత్రమే చూపుతుంది. అందుకు నిదర్శనమే ఈ కుక్క. చనిపోయిన యజమాని మృతదేహం పక్కనే కూర్చొని గంటలపాటు అలానే ఉండిపోయింది. అధికారులు కుక్కను తరిమికొట్టేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటకీ ఫలితం లేకపోయింది.
యజమాని మృతదేహం దగ్గరకు వచ్చిన వారిని కరిచేందుకు యత్నించింది. యజమానిపై విశ్వాసంతో ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. చివరికి ఎలాగో అలా యజమాని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. 57ఏళ్ల వ్యక్తి తాగిన మత్తులో రైల్వే ట్రాక్ పై దాటుతున్న క్రమంలో అదే ట్రాక్ పై దూసుకొచ్చిన రైలు అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కుక్క యజమాని అక్కడిక్కడే మృతిచెందాడు.
తన యజమాని ఎప్పటికైనా లేస్తాడనే కుక్క అలానే అక్కడ కూర్చొండి పోవడం అందరిని కంటతడి పెట్టిస్తోంది. మృతిచెందిన యజమానికి కుక్క తప్ప మరొకరు తోడు లేరట. ఈ ఘటన సరిగ్గా ఎక్కడ జరిగిందో తెలియదుగానీ, దీనికి సంబంధించిన ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి ఘటనే ఓ ఆస్పత్రిలో జరిగింది. ప్రాణపాయ స్థితిలో యజమాని ఆస్పత్రిలో చేరాడు. అతడితోపాటు కుక్క కూడా వచ్చింది. ఆస్పత్రి చికిత్స పొందుతూ యజమాని మృతిచెందాడు. ఆ విషయం తెలియని మూగజీవి తన యజమాని కోసం ఆస్పత్రి డోర్ బయటే వారం రోజులుగా ఎదురుచూస్తూ ఉండిపోయింది.