P Chidambaram : మోదీ భయపడేది ఆ ఒక్క విషయానికే!
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుని "వినాశకరమైనది"గా అభివర్ణించారు అని కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి చిదంబరం. అసోం కాంగ్రెస్ కార్యకర్తలకు నిర్వహిస్తున్న

Chidambaram
P Chidambaram : బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుని “వినాశకరమైనది”గా అభివర్ణించారు అని కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి చిదంబరం. దేశ ఆర్ధిక వ్యవస్ధ పతనావస్ధలో ఉందని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. అసోం కాంగ్రెస్ కార్యకర్తలకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణా శిబిరంలో గురువారం చిదంబరం ప్రసంగిస్తూ..వివిధ రంగాల్లో విఫలమైన మోదీ ప్రభుత్వం కొనసాగితే దేశం కుప్పకూలడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైఫల్యాల నుంచి బయటపడేందుకు మోదీ సర్కార్ మతాన్ని ఎక్కుపెట్టి దేశాన్ని విభజించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రతి ఎన్నికలోనూ మోదీని ఓడించడం ద్వారానే దేశాన్ని కాపాడుకోగలుగుతామని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒకే ఒక్క భయం ఉందని చిదంరం అన్నారు. “ఎన్నికలలో ఓడిపోతాం” అనే భయం తప్ప ప్రధాని మోదీకి మరే భయం లేదని వ్యాఖ్యానించారు. మోదీకి తమ పార్టీ ఎంపీలు, సీఎంలు, మంత్రులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, న్యాయమూర్తులు, దేవుడు ఇలా ఎవరన్నా లెక్కలేదని కేవలం ఎన్నికల్లో ఓటమి అంటేనే ఆయన భయపడతారని అన్నారు. ఎలాంటి పరిస్ధితిలోనైనా ఎన్నికల్లో ఓటమిని ఆయన కోరుకోరని కనీసం ఒకదానికి గురించైనా ఆయన భయపడుతుండటం తనకు సంతోషాన్ని ఇస్తోందని చిదంబరం ఎద్దేవా చేశారు.