‘పాక్.. భారత్‌ను బంధువులా చూస్తోంది’

‘పాక్.. భారత్‌ను బంధువులా చూస్తోంది’

Updated On : September 15, 2019 / 11:50 AM IST

‘పాకిస్తాన్ దేశస్థులు భారతదేశం చేసే పనులకు అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. వాళ్లు భారత్‌ను బంధువులా భావిస్తున్నారు’ అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. పాకిస్తాన్‌లో పర్యటించిన శరద్ పవార్ తన అనుభవాన్ని శనివారం మీడియాతో ముందు వెల్లడించాడు. రాజకీయ లబ్ధి కోసమే భారత్‌లో పాకిస్తాన్‌కు వ్యతిరేక ప్రచారం చేశారని ఆరోపించారు. 

‘పాకిస్తానీయులు న్యాయం జరగలేదని, అసంతృప్తితో ఉన్నారంటూ వస్తున్న వార్తలేమీ నిజం కాదు. పాకిస్తాన్‌లో నిజమైన పరిస్థితులను సరిగా అర్థం చేసుకోకుండా రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వాదనలు చేస్తున్నారు. అక్కడ ఉన్నవారు భారత్ లో ఉన్న బంధువులను కలవడం కుదరకపోయినా.. భారత్‌ను బంధువులాగే భావిస్తామని అంటున్నారు’ అని ఆయన వివరించారు. 

కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ఇప్పటికే పలుమార్లు పాకిస్తాన్ లో పర్యటించారు. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారి తనకు చక్కటి స్వాగతం లభించిందని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిలో 40మంది జవాన్ల ప్రాణాలు బలిగొనడంతో మొదలైన పొరపచ్చాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాది క్యాంపులపై భారత్ దాడి చేసింది. ఆ తర్వాత కశ్మీర్ కు ప్రత్యేక హోదా తొలగిస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేసింది.