High Court: సహజీవనం ఏ విధంగా ఆమోదయోగ్యం కాదు – హైకోర్టు

సహజీవనంపై పంజాబ్, హరియాణా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సహజీవనం అనేది సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఓ కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని తార్న్ తరన్ జిల్లాకు చెందిన గుల్జా కుమారి(19), గురువిందర్‌ సింగ్‌(22) ఇద్దరు ప్రేమించుకున్నారు.

High Court: సహజీవనం ఏ విధంగా ఆమోదయోగ్యం కాదు – హైకోర్టు

High Court

Updated On : May 18, 2021 / 5:45 PM IST

High Court:  సహజీవనంపై పంజాబ్, హరియాణా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సహజీవనం అనేది సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఓ కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని తార్న్ తరన్ జిల్లాకు చెందిన గుల్జా కుమారి(19), గురువిందర్‌ సింగ్‌(22) ఇద్దరు ప్రేమించుకున్నారు. వారి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొద్దీ రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయారు.

ఇద్దరు కలిసి ఉంటున్నారు.. త్వరలో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వీరికి గుల్జా కుమారి కుటుంబం నుంచి ప్రాణహాని ఉండటంతో కోర్టును ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పిస్తూ లివ్‌ ఇన్‌ రిలేషన్‌కు ఆమోద ముద్ర వేయాలని జంట కోరింది. అయితే వీరి పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. సహజీవనం నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదని జస్టిస్‌ హెచ్‌ఎస్‌ మదాన్‌ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.