Tamilandu: దళిత మహిళ వంట తినని విద్యార్థులు.. అనూహ్యంగా స్పందించి, ప్రశంసలు అందుకుంటున్న ఎంపీ కనిమొళి
విద్యార్థులు తాను తయారుచేసిన అల్పాహారాన్ని తినడానికి నిరాకరించారని, ఎందుకంటే వారి తల్లిదండ్రులు వాటిని తినకూడదని నిషేధించారని మునియసెల్వి చెప్పింది. కారణం తాను దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి. తాను తయారుచేసిన అల్పాహారం తింటే, గ్రామస్తులు వారిని తరిమికొడతారని పిల్లలు మాట్లాడుకుంటున్న తీరు చూసి బాధేసిందని ఆమె వాపోయింది.

DMK MP Kanimozhi: తమిళనాడులోని ఉసిలంపాటి పాఠశాలలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటన తెలిసే ఉంటుంది. ముఖ్యమంత్రి అల్పాహార పథకం కింద ప్రభుత్వ పాఠశాలలోని వంట గదిలో తయారు చేసిన అల్పాహారాన్ని దళిత మహిళ వండిందనే కారణంతో విద్యార్థులు తినడానికి నిరాకరించారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే దీనిపై స్థానిక అధికార పార్టీ నేత, ఎంపీ కనిమొళి స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఉసిలంపాటి ప్రాథమిక పాఠశాలలో స్వయం సహాయక సంఘం సభ్యురాలు దళిత మహిళ మునియసెల్వి వంట మనిషిగా పని చేస్తోంది. అయితే 11 మంది విద్యార్థులలో తొమ్మిది మంది విద్యార్థులు తాను తయారుచేసిన అల్పాహారాన్ని తినడానికి నిరాకరించారని, ఎందుకంటే వారి తల్లిదండ్రులు వాటిని తినకూడదని నిషేధించారని మునియసెల్వి చెప్పింది. కారణం తాను దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి. తాను తయారుచేసిన అల్పాహారం తింటే, గ్రామస్తులు వారిని తరిమికొడతారని పిల్లలు మాట్లాడుకుంటున్న తీరు చూసి బాధేసిందని ఆమె వాపోయింది.
Rajinikanth : చంద్రబాబు అరెస్ట్ పై రజనీకాంత్ రియాక్షన్, కీలక వ్యాఖ్యలు చేసిన సూపర్ స్టార్
అందుకే వారు అల్పాహారం తీసుకోవడానికి నిరాకరించారట. అందుకే తాను విద్యార్థులను బలవంతం చేయలేదని ఆమె అన్నారు. ఫుడ్ స్టాక్ గురించి అధికారులు వంట మనిషిని వివరాలు అడగగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెండు రోజులుగా విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త.. డీఎంకే ఎంపీ కనిమొళికి చేరింది. ఆ వెంటనే ఆమె రంగంలోకి దిగారు. సదరు పాఠశాలకు వెళ్లి అదే దళిత వంట మనిషి వండిన ఆహారాన్ని స్కూలు పిల్లలతో కలిసి కనిమొళి తిన్నారు. దీంతో ఆమెపై నెటిజెన్లు ఇతరులు, ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ విషయమై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారితో మాట్లాడారు. అనంతరం డీఎంకే ఎంపీ కనిమొళి, రాష్ట్ర మంత్రి గీతాజీవన్, జిల్లా కలెక్టర్ సెంథిల్ రాజ్ పాఠశాలను సందర్శించారు. ఈ సమయంలో ఆమె పిల్లలతో కలిసి అల్పాహారం చేశారు. తమిళనాడులోని విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత ఏడాది ఆగస్టులో ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని’ ప్రారంభించారు. దీని కింద రోజుకు 15.75 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందజేస్తున్నారు.