Air India : ఎయిర్ ఇండియా విమానంలో సీలింగ్ నుంచి వాటర్ లీకేజీ.. ప్రయాణికుల ఆందోళన

ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓవర్ హెడ్ బిన్స్ నుండి నీరు లీక్ అవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కారణమేమై ఉంటుందని చర్చలు జరిపారు.

Air India : ఎయిర్ ఇండియా విమానంలో సీలింగ్ నుంచి వాటర్ లీకేజీ.. ప్రయాణికుల ఆందోళన

Air India

Air India : ఎయిర్ ఇండియా విమానంలో ఓవర్ హెడ్ బిన్స్ నుండి ప్రయాణికుల సీట్లపైకి నీరు కారుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటనపై నెటిజన్లు కారణంమేంటని ప్రశ్నించారు.

@baldwhiner అనే ట్విట్టర్ యూజర్ విమానంలోని ఓవర్ హెడ్ బిన్స్ నుండి నీరు లీక్ అవుతున్న వీడియోను షేర్ చేసారు. వీడియోలో ప్రయాణికుల సీట్లు తడిసిపోయినట్లు కనిపించింది. ‘ఎయిర్ ఇండియా.. మాతో ప్రయాణించండి.. ఇది ప్రయాణం కాదు.. మునిగిపోతున్న అనుభూతి’ అనే వ్యంగ్యమైన శీర్షికతో షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై వినియోగదారులు స్పందించారు. కానీ నీటి లీకేజీకి కారణం మాత్రం గుర్తించలేకపోయారు.

ఢిల్లీ నుండి లండన్‌లోని గ్వాటిక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ B787 డ్రీమ్ లైనర్‌లో ఈ ఘటన జరిగినట్లు జర్నలిస్టు మాధురి అద్నాల్ పేర్కొన్నారు. విమాన వివరాలు దృవీకరించబడనప్పటికీ ‘ఏదైనా ఎయిర్ లైన్‌లో ఇలా ఎప్పుడైనా జరిగిందా’ అంటూ పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. ‘ఇది సాంకేతిక లోపం అయి ఉండొచ్చు.. ఎయిర్ లైన్ పరువు తీసేలా వీడియోను ప్రచారం చేసే అబ్బాయిల కంటే ప్రయాణీకులు చాలా సౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తోంది’ అంటూ కామెంట్లు పెట్టారు. సోషల్ మీడియా పోస్టులపై ఎయిర్ ఇండియా ఇంకా స్పందించలేదు.

Also Read: ఎయిర్ ఇండియా ప్రయాణీకుల కోసం టాటా ఏఐజీ ప్రయాణ బీమా.. పూర్తి వివరాలు మీకోసం..!