పతంగి మాంజాకు కరెంట్ : నిలువునా కాలిపోయిన చిన్నారి
గాలిపటం ఎగరేయాలనే చిన్నారిని కరెట్ షాక్ నిలువునా కాల్చేసింది. దేశవ్యాప్తంగా సంక్రాంతి వేడులకల్లో గాలిపటాలు ఎగురవేయడం చిన్నవారి నుండి పెద్దవారి వరకూ ఓ సరదా. సంక్రాంతి సంబరాలు కొంతమంది కుటుంబాల్లో విషాదాన్ని కలగజేస్తున్నాయి.
గాలిపటం ఎగరేయాలనే చిన్నారిని కరెట్ షాక్ నిలువునా కాల్చేసింది. దేశవ్యాప్తంగా సంక్రాంతి వేడులకల్లో గాలిపటాలు ఎగురవేయడం చిన్నవారి నుండి పెద్దవారి వరకూ ఓ సరదా. సంక్రాంతి సంబరాలు కొంతమంది కుటుంబాల్లో విషాదాన్ని కలగజేస్తున్నాయి.
ప్రాణం తీసిన పతంగి సరదా
సంక్రాంతి సంబరాల్లో విషాదం
డాబాలో గాలిపటం ఎగరేస్తుండగా హైటెన్షన్ వైర్ షాక్
నిలువెల్లా గాయలతో చిన్నారి ఆఫ్రీనో
చికిత్స పొందుతు వారం రోజులకు ఆసుపత్రిలో చిన్నారి మృతి
జైపూర్ : గాలిపటం ఎగరేయాలనే చిన్నారిని కరెట్ షాక్ నిలువునా కాల్చేసింది. దేశవ్యాప్తంగా సంక్రాంతి వేడులకల్లో గాలిపటాలు ఎగురవేయడం చిన్నవారి నుండి పెద్దవారి వరకూ ఓ సరదా. సంక్రాంతి సంబరాలు కొంతమంది కుటుంబాల్లో విషాదాన్ని కలగజేస్తున్నాయి. దీపావళి వచ్చిందంటే పటాసులు,సంక్రాంతి వస్తోందంటే పతంగులు సరదాలు కొంతమంది జీవితాలను విషాదంగా మారుస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్‌లో ఓ చిన్నారి గాలిపటం ఎగురవేస్తుండగా..పతంగి దారం విద్యుత్ తీగలకు తగిలి చిన్నారి నిలువునా కాలిపోయిన దుర్ఘటన చోటుచేసుకుంది. జైపూర్‌లోని ఖర్ఘనీ ప్రాంతంలోని గణేశ్ కాలనీకి చెందిన అష్రఫ్ ఖాన్ కుమార్తె ఆఫ్రీనో బానో జనవరి 4న వాళ్ల ఇంటి డాబాపైన గాలిపటం ఎగురవేస్తు సంబరం పడుతు గెంతులేస్తోంది.
ఈ సమయంలో గాలిపటం దారం (మాంబా) హైటెన్షన్ వైర్లకు తగిలింది. దీంతో విద్యుత్ భారీగా ప్రసారం కావడంతో అఫ్రీనో కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే చిన్నారి ఆఫ్రీనోను ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి ఆఫ్రీనో జనవరి 11న ఆసుపత్రిలోనే చనిపోయింది. దీంతో అష్రఫ్ ఖాన్ కుటుంబంలో సంక్రాంతి చీకటిని మిగిల్చింది.