ఉడుపి పెజావర పీఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి శివైక్యం
పెజావర్ మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీ ఆదివారం (డిసెంబర్ 29,2019) ఉదయం శివైక్యం చెందారు. స్వామీజీ వయసు 88 ఏళ్లు. కొన్ని రోజుల కిందట స్వామీజీ ఆరోగ్యం

పెజావర్ మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీ ఆదివారం (డిసెంబర్ 29,2019) ఉదయం శివైక్యం చెందారు. స్వామీజీ వయసు 88 ఏళ్లు. కొన్ని రోజుల కిందట స్వామీజీ ఆరోగ్యం
పెజావర మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీ ఆదివారం (డిసెంబర్ 29,2019) ఉదయం శివైక్యం చెందారు. స్వామీజీ వయసు 88 ఏళ్లు. కొన్ని రోజుల క్రితం స్వామీజీ ఆరోగ్యం క్షీణించడంతో మణిపాల్ కస్తూర్బా ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. కోలుకునే అవకాశాలు లేవని డాక్టర్లు తేల్చడంతో శనివారం(డిసెంబర్ 28,2019) సాయంత్రం ఆసుపత్రి నుంచి మఠానికి తరలించారు. మఠంలోనే తుది శ్వాస వదలాలని స్వామీజీ చెబుతుండేవారు. ఈ నేపథ్యంలోనే కృత్రిమ శ్వాసతోనే ఆయనను మఠానికి తరలించారు. మఠానికి చేరిన కొన్ని గంటల్లోనే స్వామీజీ తుదిశ్వాస విడిచారు.
కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతికి విశ్వేశతీర్థ స్వామి గురువు. స్వామీజీ ఆరోగ్యం క్షీణించడంతో ఉమా భారతి శనివారం అంతా ఆసుపత్రి దగ్గరే ఉన్నారు. విశ్వేశతీర్థ ఆరోగ్యం విషమించడంతో కర్నాటక సీఎం యడియూరప్ప శనివారం తమ కార్యక్రమాల్ని రద్దు చేసుకుని ఉడుపి చేరుకున్నారు. స్వామీజీ మరణం పట్ల సీఎం యడియూరప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
స్వామిజీ భౌతికకాయాన్ని భక్తుల సందర్శనార్ధం ఉడుపి అజ్జార్‌కడ్ మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు ఉంచారు. ఆ తర్వాత మిలటరీ హెలికాప్టర్‌లో బెంగళూరు తరలించారు. ప్రముఖుల సందర్శనార్ధం నేషనల్ కాలేజీ మైదానంలో కాసేపు ఉంచుతామని ఉడుపి ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం విద్యాపీఠ్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వామీజీ శివైక్యంతో శిష్యులు, భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశ్వేశతీర్థ సేవలు అజరామరమైనవి, ఆయన ఎప్పటికీ మన మధ్యనే ఉంటారని ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే అన్నారు. స్వామీజీ శిష్యుడు విశ్వప్రసన్నతీర్థ తదుపరి మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
విశ్వేశ్వ తీర్థ స్వామీజీ శివైక్యం పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ”లక్షలాది మంది హృదయాల్లో ఉడుపి చిరస్థాయిగా నిలిచిపోతుంది. మార్గదర్శకుడిగా విశ్వేశ్వ తీర్థ స్వామి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. సేవ, ఆధ్యాత్మికతకు స్వామీజీ ఓ పవర్ హౌస్ లాంటి వారు. ఓం శాంతి” అని మోడీ ట్వీట్ చేశారు.
Sri Vishvesha Teertha Swamiji of the Sri Pejawara Matha, Udupi will remain in the hearts and minds of lakhs of people for whom he was always a guiding light. A powerhouse of service and spirituality, he continuously worked for a more just and compassionate society. Om Shanti. pic.twitter.com/ReVDvcUD6F
— Narendra Modi (@narendramodi) December 29, 2019
Also Read : వృద్దుల్లో కంటిచూపు పోవడానికి ప్రధాన కారణం మాంసాహారం