Metro Coaches : అద్దెకిస్తాం, బర్త్ డే..ఇతర వేడుకలకు మెట్రో రైలు కోచ్ లు

మెట్రో స్టేషన్ లో బ్యానర్లు, స్టాండ్లు, పందిళ్లు ఏర్పాటు చేసుకుని చిన్న చిన్న ప్రకటనలకు అవకాశం కల్పించింది.

Metro Coaches : అద్దెకిస్తాం, బర్త్ డే..ఇతర వేడుకలకు మెట్రో రైలు కోచ్ లు

Birthdays

Updated On : March 19, 2021 / 7:34 PM IST

Rajasthan : కరోనా వైరస్ కారణంగా..అన్ని రంగాలు కుదేలు అయిపోయాయి. ఎంతో మందిని నష్టాల పాల్జేసింది. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ కోలుకపోతున్నారు. పలు రంగాలు కూడా తీవ్రమైన నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆర్థికంగా కోలుకోవడానికి పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు ప్రభుత్వాలు వినూత్నంగా ముందుకు వస్తున్నాయి. డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

తాజాగా..రాజస్థాన్ జైపూర్ మెట్రో రైల్వే అధికారులు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. మెట్రో స్టేషన్ లో బ్యానర్లు, స్టాండ్లు, పందిళ్లు ఏర్పాటు చేసుకుని చిన్న చిన్న ప్రకటనలకు అవకాశం కల్పించింది. తాజాగా…బర్త్ డే, ఇతరత్రా వేడుకలకు రైల్వే కోచ్ లను అద్దెకు తీసుకోవచ్చని జైపూర్ మెట్రో వెల్లడించడం విశేషం. గంటల చొప్పున వీటిని అద్దెకు తీసుకోవచ్చని, కోచ్ లను అద్దెకు తీసుకొనే వారు…గంటకు రూ. 5 వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. సమయం మించితే..గంటకు అదనంగా రూ. 1000 ఛార్జీ వసూలు చేయడం జరుగుతుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థతో జైపూర్‌ మెట్రో ఒప్పందం కుదుర్చుకుంది.