Roll Belans : అప్పడాల కర్రతో పొట్ట తగ్గిపోతుందా?

బరువు తగ్గటానికి వింత వింత ఎక్సర్ సైజ్‌లు చేస్తున్నారు. రీసెంట్‌గా పొట్టలో కొవ్వు కరగడానికి అప్పడాల కర్రతో ఎక్సర్‌సైజ్ లు చేస్తున్నారు. ఈ వింత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Roll Belans : అప్పడాల కర్రతో పొట్ట తగ్గిపోతుందా?

 Roll Belans

Updated On : May 11, 2023 / 10:41 AM IST

Roll Belans : ఇటీవల కాలంలో చాలామందిలో బరువు తగ్గాలనే కాంక్ష ఎక్కువైంది. అందుకోసం వాకింగ్ చేయడం.. ఆహార నియమాలు పాటించడం.. జిమ్‌కి వెళ్లి ఎక్సర్ సైజ్‌లు లాంటివి చేయడం చూశాం. కానీ పొట్ట తగ్గించుకోవడానికి అప్పడాల కర్రను వాడటం మీరు చూసారా? ఆ వింత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాదంతో.. అధిక బరువుకు చెక్

Chirag Barjatya అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఏమి చేయాలన్నా ఈ దేశంలో ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి” అంటూ ఆయన పోస్ట్ చేసిన వీడియోలో స్ట్రీలు, పురుషులు తమ పొట్టపై అప్పడాల కర్రతో రుద్దుకుంటూ కనిపించారు. ఆక్యుప్రెషర్ ట్రైనర్ వారికి క్లాస్ తీసుకుంటున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. లక్షల సంఖ్యలో జనం ఈ వీడియో చూసారు.

Rose Tea : బరువు తగ్గడానికి రోజ్ టీ ఎలా ఉపయోగపడుతుంది? రోజ్ టీ తయారీ ఎలాగంటే ?

బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవడానికి అప్పడాల కర్రను వాడటం ఏంటని నెటిజన్లు ఫన్నీ కామెట్లు పెడుతున్నారు. ఆ అప్పడాల కర్రను తిరిగి వంటింట్లో వాడలేమని.. జనాన్ని పిచ్చి వాళ్లను చేయడానికి ఇలాంటివి ఇంప్లిమెంట్ చేస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు.

 

దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. నిజంగా అప్పడాల కర్రతో బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతే ఇవి అమ్మే వారికి మంచి లాభమే అని చెప్పాలి. ఏదైనా కొంతకాలమే. రేపు ఇంకేదో కనిపెట్టగానే అప్పడాల కర్రలు పక్కన పడేస్తారని జనాలు నవ్వుకుంటున్నారు.