Bike Ride On Railway Track: ప్రాణాలను పణంగా పెట్టి.. రైల్వే ట్రాక్ పై బైక్స్ పోనిస్తున్న జనం.. వీడియో వైరల్.. కారణం ఏంటంటే..

ఆ సమయంలో రైలు వచ్చి ఉంటే పెద్ద ప్రమాదానికి దారితీసేది. అదృష్టవశాత్తూ, ప్రజలు వంతెనపై ఉన్నప్పుడు..

Bike Ride On Railway Track: ప్రాణాలను పణంగా పెట్టి.. రైల్వే ట్రాక్ పై బైక్స్ పోనిస్తున్న జనం.. వీడియో వైరల్.. కారణం ఏంటంటే..

Updated On : June 30, 2025 / 10:53 PM IST

Bike Ride On Railway Track: అది రైల్వే ట్రాక్. దానిపై రైలు మాత్రమే ప్రయాణం చేయాలి. కానీ, ఆ రైల్వే ట్రాక్ ను స్థానికులు మరోలా వాడేస్తున్నారు. దానిపై టూ వీలర్స్ ను పోనిస్తున్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు వందలాది ద్విచక్ర వాహనాలు ఆ ఆ రైల్వే ట్రాక్ పైనే వెళ్తున్నాయి. అది చాలా ప్రమాదం అని తెలుసు. అటు నుంచి రైలు వచ్చిందంటే చావు ఖాయం అని తెలుసు. అయినా తప్పడం లేదు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ ద్విచక్ర వాహనదారులు ఆ రైల్వే ట్రాక్ పై ప్రయాణం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైల్వే ట్రాక్ పై బారులు తీరిన బైక్ లను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

మ్యాటర్ లోకి వెళితే.. అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్. అక్కడ వర్షాల కారణంగా రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. అసలు సరైన రోడ్లు లేవు. గ్రామం నుంచి మరో చోటుకి వెళ్లాలంటే గ్రామస్తులకు మరో దారి లేదు. నదిపై ఉన్న రైల్వే ట్రాక్ ను దాటాల్సిందే.

తాము వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గం కూడా లేకపోవడం వల్ల స్థానికులు ఇదిగో ఇలా రైలు వంతెనను ఉపయోగించాల్సి వచ్చింది. ప్రజలు తమ బైక్‌లతో రైల్వే ట్రాక్‌పై వెళ్తుండటం వీడియోలో గమనించవచ్చు. కొందరు తమ వాహనాలను నెమ్మదిగా నడుపుతూ ముందుకెళ్తున్నారు. మరికొందరు తోసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆ సమయంలో రైలు వచ్చి ఉంటే పెద్ద ప్రమాదానికి దారితీసేది. అదృష్టవశాత్తూ, ప్రజలు వంతెనపై ఉన్నప్పుడు ఏ రైలు కూడా అటుగా రాలేదు.

తమ ప్రాంతంలోని రోడ్డు చాలా దారుణంగా ఉండటం వల్ల తాము రైల్వే ట్రాక్‌ను ఇలా ఉపయోగించాల్సి వస్తోందని స్థానికులు వాపోయారు. అలాగే, నదిని దాటడానికి లేదా సమీప గ్రామాలకు చేరుకోవడానికి మరో సురక్షితమైన మార్గం లేదన్నారు. కొత్త రోడ్డు నిర్మించాలని లేదా పాత రోడ్డు మరమ్మతు చేయాలని ప్రజలు అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారట. అయితే, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

దీంతో మరో దారి లేక ఇదిగో ఇలా ప్రమాదం అని తెలిసినా ప్రాణాలను పణంగా పెట్టి రైల్వే ట్రాక్ పైనే ప్రయాణం చేస్తున్నారు. ఇది చాలా రిస్క్ అని తెలుసు. పట్టాలపై వెళ్లే సమయంలో ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ప్రాణాలకే ప్రమాదం అని కూడా తెలుసు. కానీ మరో మార్గం లేక రైల్వే ట్రాక్ పై ప్రయాణం చేయాల్సి వస్తోందని స్థానికులు వాపోయారు.