Today Petrol Rate : తగ్గేదేలే.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర ఎంతంటే?
విరామం లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి.

Petrol
Today Petrol Rate : విరామం లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా పెట్రోల్ డీజిల్ పై సుమారు రూ.1.5 రూపాయలు పెరిగింది. ఇక శనివారం అర్ధరాత్రి పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.90, డీజిల్ ధర రూ.105.05కు చేరింది. ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు పెట్రోల్ పై రూ.18 రూపాయలు పెరిగింది. ఇదే సమయంలో డీజిల్‌పై రూ.15 చిల్లర పెరిగింది.
చదవండి : Petrol Price: అక్టోబర్ నెలలో 18 సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు
గతేడాది మేలో అంతర్జాతీయంగా ముడిచమురు బ్యారెల్ ధర 19 డాలర్లకు పడిపోయింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 83 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఫ్యూయల్ ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చదవండి : Petrol Price: బాదుడే.. బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు