Petrol Price: బాదుడే.. బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం చర్చలు చేస్తున్నాయి.

Petrol Price: బాదుడే.. బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol

Updated On : October 22, 2021 / 7:17 AM IST

Petrol Price: పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం చర్చలు చేస్తుండగా.. ఇదే సమయంలో ధరలు మాత్రం తగ్గేలా కనిపించట్లేదు. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉండగా.. సామాన్యులకు భారం అవుతుంది.

చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేయగా.. ఇదే క్రమంలో రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు లేటెస్ట్‌గా పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు నాలుగురోజుల పాటు పెరిగిన పెట్రోల్ ధరలు.. రెండు రోజుల గ్యాప్ ఇచ్చి మళ్లీ పెరుగుతూ ఉంది.

అక్టోబర్ నెలలో ఇప్పటివరకు 17 సార్లు పెట్రోల్ ధరలు పెరగగా.. లేటెస్ట్‌గా పెరిగిన ధరలతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.106.54కి చేరుకుంది. డీజిల్‌ ధర రూ.95.27కు చేరుకుంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.112.44కు చేరుకోగా.. డీజిల్‌ ధర రూ.103.26కి చేరుకుంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.110.82కు, డీజిల్‌ ధర రూ.103.94కు చేరుకుంది.