Crude Price: భారత్‌లో భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎందుకంటే?

భారత ప్రజలు ద్రవ్యోల్బణంతో పెద్ద దెబ్బ తినబోతున్నారా? అవుననే అంటున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల భారీ పెరుగుదలకు సిద్ధంగా ఉండాల్సిందేనా? రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు..

Crude Price: భారత్‌లో భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎందుకంటే?

Petrol Price

Updated On : February 22, 2022 / 12:22 PM IST

Petrol Diesel Prices To Shoot Up: భారత ప్రజలు ద్రవ్యోల్బణంతో పెద్ద దెబ్బ తినబోతున్నారా? అవుననే అంటున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల భారీ పెరుగుదలకు సిద్ధంగా ఉండాల్సిందేనా? రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు.. తర్వాత యుద్ధానికి అవకాశం ఉండడంతో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ సెప్టెంబర్ 2014 తర్వాత ఇప్పుడు.. అంటే ఏడేళ్ల తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుంది.

ముడి చమురు ధర బ్యారెల్‌ 97డాలర్లు దాటిపోయింది. త్వరలో ఇది 100డాలర్లు కంటే పైకి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. కొత్త సంవత్సరం 2022లో, ముడిచమురు ధరలు 20 శాతానికి పైగా పెరగ్గా.. గడిచిన రెండు నెలలుగా, ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 2021లోకి ఎంటర్ అయ్యేవవరకు, ముడి చమురు ధర బ్యారెల్‌ 68.87డాలర్లుగా ఉండేది. అది ఇప్పుడు బ్యారెల్‌ 98డాలర్లకు దగ్గరగా ట్రేడవుతోంది. అంటే నెలన్నర వ్యవధిలోనే ముడి చమురు ధరలు దిగువ స్థాయి నుంచి 40 శాతంకి పెరిగిపోయాయి.

దేశంలోని పెట్రోలు, డీజిల్ ధరల్లో..
ప్రస్తుతం అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు కానీ, ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మాత్రం కచ్చితంగా భారీ మార్పు కనిపించే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ 4, 2021 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. కానీ, ఇప్పుడు ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన త్వాత ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరల్లో కచ్చితంగా మార్పు చేయవచ్చు.

భారత్ ప్రధానంగా పెట్రోల్, డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపై ఆధారపడుతోంది. అందువల్లే క్రూడ్ ధరలు అనేవి పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంకా డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పన్నులు, రూపాయి డాలర్ విలువలో మార్పు, రిఫైనరీ కన్సప్చన్ రేషియో వంటి అంశాలు ఇంధన ధరలపై ఎఫెక్ట్ చూపుతాయి.