Petrol Price: రూ.120కి చేరుకున్న పెట్రోల్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో తెలుసా?
పెరిగేది పైసల్లోనే కానీ, రోజూ పెరుగుతోంది.. దీంతో రూపాయల్లో సామాన్యునికి భారంగా మారింది. అక్టోబర్ నెలలోనే పెట్రోల్ ధర రూ. 7 వరకు పెరిగింది.

Petrol
Petrol-Diesel Price Hike: పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గేలా కనిపించట్లేదు. సామాన్యుడికి భారంగా మారుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోలు, డీజిల్ ధరలు 35 పైసలు పెరిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ ధరలు ఎక్కవయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో పెట్రోల్ 114.28కి చేరుకోగా.. డీజిల్ 106.86గా ఉంది. గరిష్టంగా చిత్తూరులో పెట్రోల్ ధర 116.09కు చేరుకోగా.. డీజిల్ ధరలు 108.45కి చేరుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్రోల్ ధరలు విషయానికి వస్తే, హైదరాబాద్‌లో రూ.112.27కి చేరగా.. డీజిల్ 105.46కి చేరుకుంది. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ రేటు 114.51కి చేరుకోగా.. అదే జిల్లాలో డీజిల్ ధర 107.54గా ఉంది. అక్టోబర్ నెలలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర 7రూపాయలు డీజిల్ ధర 8రూపాయల వరకు పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరు రూ. 108, 29 పైసలకు చేరుకోగా, డీజిల్ ధర రూ. 97, 02 పైసలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ రూ. 113.80గా ఉండగా, డీజిల్ లీటరుపై రూ. 104.75గా ఉంది. బుధవారం కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.45 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.99.78గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.83కి చేరుకోగా, డీజిల్ ధర రూ.100.92కి పెరిగింది.
మధ్యప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో పెట్రోల్ రూ.120:
మధ్యప్రదేశ్ సరిహద్దులోని అనుప్పూర్ జిల్లాలో ఇంధన ధరల మంట పుట్టిస్తున్నాయి. జిల్లాలో లీటరు పెట్రోలు ధర రూ.120.4 కాగా, డీజిల్ ధర రూ.110కి చేరింది. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని బాలాఘాట్ జిల్లాలో పెట్రోల్ ధర లీటరు రూ.119.23కి చేరింది.