Petrol Price In India : పెట్రోల్ రేట్లు..సెంచరీ నాటౌట్

పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ ధర రూ. 0.28 పెరిగి...రూ. 98.48కి చేరుకోగా..డీజిల్ ధర లీటర్ రూ. 0.30 పెరిగి..రూ. 93.38 అయ్యింది.

Petrol Price In India : పెట్రోల్ రేట్లు..సెంచరీ నాటౌట్

Petrol

Updated On : June 5, 2021 / 9:23 AM IST

Petrol Price in India : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు కరోనాతో అల్లాడుతుంటే..పెరిగిన ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది.

అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి..దేశీయంగా పెంపు ఉంటోందంటున్నాయి కంపెనీలు. నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంచేస్తున్నారు. మే నెల నుంచి ఈ ధరల బాదుడు షురూ అయ్యింది. తాజాగా..పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ ధర రూ. 0.28 పెరిగి…రూ. 98.48కి చేరుకోగా..డీజిల్ ధర లీటర్ రూ. 0.30 పెరిగి..రూ. 93.38గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.0.00 పెరిగి రూ. 99.99కి చేరగా, డీజిల్ ధర లీటర్ రూ.0.01 పెరిగి రూ.95.02కి చేరుకుంది.

ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ. 94.76, డీజిల్ ధర రూ. 85.66
ముంబైలో పెట్రోల్ లీటర్ ధర రూ. 100.98, డీజిల్ ధర రూ. 92.99
బెంగళూరులో పెట్రోల్ లీటర్ ధర రూ. 97.92, డీజిల్ ధర రూ. 90.81.
చెన్నైలో పెట్రోల్ లీటర్ ధర రూ. 96.23, డీజిల్ ధర రూ. 90.38.
కోల్ కతాలో పెట్రోల్ లీటర్ ధర రూ. 94.76, డీజిల్ ధర రూ. 88.51.

Read More : CM Jagan : సీఎం జగన్ గొప్పమనసు, ఆ డాక్టర్ చికిత్సకు రూ.కోటి సాయం