ప్లాస్మా థెరఫీ అందరికి సెట్ కాదు.. అందరి నుంచి తీసుకోవడానికి లేదు

ప్లాస్మా ట్రీట్‌మెంట్‌తో ఎంతటి కరోనా మహమ్మారినైనా తరిమికొట్టవచ్చు. పాజిటివ్ నుంచి నెగటివ్‌గా మారిన వ్యక్తి ప్లాస్మాను.. కరోనాతో కొట్టిమిట్టాడుతోన్న వారికి వరప్రదాయినిలా వినియోగించవచ్చు. ఇవన్నీ మొన్నటి వరకు అందరూ అనుకుంటున్న మాటలు. ఇప్పుడు ప్లాస్మా కూడా కరోనాకు పనిచేయడం లేదు. కొంతకాలంగా ప్లాస్మా థెరపి చేసిన పేషంట్స్‌లో కూడా చాలా వరకు మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. నిజానికి ప్లాస్మా ఎవరికి.. ఎలా పనిచేస్తుంది?
కరోనా పాజిటివ్ వచ్చి.. కొంత సీరియస్ కండిషన్‌లో ఉన్నారు అంటే.. ఠక్కున ప్లాస్మా థెరపీ చేస్తే బతికే చాన్స్ ఉందని చాలా మంది అంటుంటారు. ఎవరికి పడితే వారికి ప్లాస్మా ఎక్కించేందుకు వీలు కాదు. వెంటిలేటర్ ట్రీట్‌మెంట్ జరుగుతున్న వ్యక్తికి ప్లాస్మా ఇచ్చినా పనిచేయదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు పాజిటివ్ నుంచి కోలుకుని.. నెగటివ్‌గా మారిన వ్యక్తులంతా ప్లాస్మా ఇచ్చేందుకు అర్హులు కాదు.
ప్లాస్మా ఇవ్వాలంటే దాతలో యాంటీబాడీస్ అభివృద్ధి చెంది ఉండాలి. పాజిటివ్ వచ్చి నెగటివ్‌గా మారిన తర్వాత.. దాదాపు 28 రోజులు పూర్తయ్యి ఉండాలి. ప్లాస్మా గ్రహీతకు కూడా కొన్ని లక్షణాలు ఉంటేనే ప్లాస్మా థెరపీ చేస్తారు. కోమార్బిట్ కండీషన్‌లో ఉన్న వారికి ప్లాస్మా థెరపి ఉపయోగపడదు. కేవలం మైల్డ్, మోడ్రేట్ సింటమ్స్ ఉన్న వారికే ప్లాస్మా ప్రయోగం ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటి వరకు సక్సెస్ అయిన వారిలో కూడా ఈ కోవకు చెందిన వారే ఎక్కువ.
కరోనా పాజిటివ్ వచ్చిన పేషంట్స్‌కు ప్లాస్మా ఎక్కిస్తామంటూ కొన్ని ఆస్పత్రులు దందా చేస్తున్నాయి. కోవిడ్ పేషంట్ల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. ప్లాస్మా సేకరించే వ్యక్తిలో యాంటీబాడీలు డెవలప్ అయ్యాయా.. లేదా అనే విషయాలను కూడా వారు తెలుసుకోవడం లేదు. కరోనా నుంచి కోలుకున్నారని తెలిస్తే చాలు ప్లాస్మా తీసేస్తున్నారు.
ప్లాస్మా థెరపి విషయంలో అనేక అపోహలతో చాలా మంది భయపడిపోతుంటారు. కరోనా నుంచి కోలుకుని యాంటీబాడీలు అభివృద్ధి చెందిన వారు.. ప్లాస్మా ఇచ్చేందుకు యువతీయువకులు కూడా సందేహిస్తున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు.. ఊపిరి తిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్న వారికి ప్లాస్మా ఇస్తే… కొంతమేర కోలుకునే అవకాశముంది. ప్లాస్మా అందరికీ పనిచేయదు. అలాగే కరోనా నుంచి కోలుకున్న వారందరిలోనూ యాంటీ బాడీస్ డెవలప్ కావు.
కొందరిలోనే యాంటీబాడీస్ ఉంటాయి. అలాంటి వారి నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ కూడా ఇవే చెబుతున్నాయి. కాబట్టి… ప్లాస్మా థెరపీ అందరికీ చేయడం కూడా సాధ్యపడదు.