PM Kisan Samman Nidhi : రైతులకు ఆర్థిక సహాయం పెంచనున్నకేంద్రం .. ఎంతంటే..

PM Kisan Samman Nidhi : రైతులకు ఆర్థిక సహాయం పెంచనున్నకేంద్రం .. ఎంతంటే..

Updated On : January 28, 2023 / 3:26 PM IST

pm kisan samman nidhi scheme : మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రైతులకు కేంద్రం అందించే సహాయం రూ.6,000గా ఉంది. దాన్ని పెంచాలని కేంద్రం అనుకున్నట్లుగా తెలుస్తోంది. రూ.6,000లను రూ.8 వేల నుంచి రూ.12వేలకు పెంచనున్నట్లుగా తెలుస్తోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలం మరింత పెరిగేలా ఈ బడ్జెట్ రూపొందించినట్లుగా సమాచారం. ఎందుకంటే మరోసారి అధికారంలోకి రావాలంటే ఈ బడ్జెట్ ద్వారా ప్రజలను మెప్పించాలి. ప్రజలకు ఇచ్చే పథకాలతో ఆకట్టుకోవాలి. ఈ వచ్చే ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. అందుకే కేంద్రం ఆచీ తూచి ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో ఆలోచించి ఈ బడ్జెట్ ను రూపొందించినట్లుగా తెలుస్తోంది. అన్ని వర్గాలను మెప్పించాలి. అన్ని వర్గాలవారిపై వరాల జల్లు కురిపించాల్సిన అవసరం ఉంది. అందుకే అన్ని వర్గాలవారిని ఈ బడ్జెట్ ద్వారా మెప్పించే అకాశముందని తెలుస్తోంది.

మరి ముఖ్యంగా భారతదేశం వ్యవసాయంపై ఆధారపడిన దేశం. దేశ వ్యాప్తంగా రైతులే ఎక్కువగా ఉంటారు. అందుకే రైతును దృష్టిలో పెట్టుకుని రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ చివరి బడ్జెట్‌ ఉందనుంది. దాంట్లో భాగంగానే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు అందించే మొత్తాన్ని పెంచే యోచనలో కేంద్ర సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. రైతులకు మరింత లబ్ది చేకూరేలా ఈ బడ్జెట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం పీఎం కిసాన్ యోజన కింద సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం రైతులకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. దీన్ని ఏడాదికి మూడు విడతలుగా ఇస్తోంది. రూ.2000 చొప్పున అందజేస్తున్నారు. అయితే పీఎం కిసాన్ మొత్తాన్ని ఈసారి బడ్జెట్‌లో రూ.8,000 నుంచి రూ.12వేలకు పెంచే అవకాశం ఉంది. రూ.2000 చొప్పున నాలుగు విడతల్లో రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు.