Police Commemoration Day : విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు మోడీ,షా నివాళి

  • Published By: venkaiahnaidu ,Published On : October 21, 2020 / 04:50 PM IST
Police Commemoration Day : విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు మోడీ,షా నివాళి

Updated On : October 21, 2020 / 5:28 PM IST

PM Modi Pay Homage To Policemen Who Died In The Line Of Duty విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఇవాళ అమరవీరుల ​ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్​ వేదికగా నివాళులర్పించారు ప్రధాని మోడీ. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా అమ‌రులైన పోలీసుల‌ త్యాగాలు, సేవ‌ల‌ను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటామ‌న్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలపటమే అమరవీరుల దినోత్సవానికి నిజమైన అర్థమన్నారు. ప్రజలకు సేవచేసేందుకు పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని, ఇది మనం గర్వించాల్సిన విషయమని అన్నారు.



వారి త్యాగాలు మరువలేనివన్నారు. శాంతిభద్రతలు కాపాడటం నుంచీ అత్యంత క్లిష్టమైన నేరాల్ని ఛేదించేవరకు పోలీసులు చేస్తోన్న కృషిని ప్రధాని కొనియాడారు. కొవిడ్​-19 కట్టడిలో భాగంగా పోలీసుల చేస్తోన్న సేవలను అభినందించారు.



https://10tv.in/cm-kcr-writes-letter-to-pm-modi-to-release-funds-for-relief-work/
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ ​షా ఇవాళ ఢిల్లీలోని పోలీస్​ అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించారు. కొవిడ్ -19పై పోరులో 343మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.