ప్రధాని నరేంద్ర మోదీ కంటతడి

pm modi cry in rajya sabha: ప్రధాని నరేంద్ర మోదీ కంటతడి పెట్టారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ కు వీడ్కోలు సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ఆ సమయంలో మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కంటతడి పెట్టారు. ఆజాద్ ను ప్రశంసలతో ముంచెత్తారు ప్రధాని మోదీ. అధికారంలో ఉన్నా లేకున్నా ఆజాద్ ఒకేలా ఉన్నారని మోదీ చెప్పారు.
తరతరాలకు ఆజాద్ స్ఫూర్తి దాయకం అన్నారు. ఆజాద్ తనకు మంచి మిత్రుడని మోదీ చెప్పారు. ఆజాద్ సేవలను కొనియాడిన ప్రధాని మోదీ, దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం అన్నారు. తన ప్రసంగం సందర్భంగా ఆజాద్ కు ప్రధాని మోదీ సెల్యూట్ చేశారు. రాజకీయాల్లో మచ్చ లేని నేత అంటూ ఆజాద్ ని కీర్తించారు. కాగా, ఏప్రిల్ లో రాజ్యసభ సభ్యుడు ఆజాద్ పదవీ కాలం ముగియనుంది.