మోడీకి ఈసీ క్లీన్ చిట్

భారత్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపస్స్ ఉన్నాయి,పాక్ బెదిరింపులకు భారత్ భయపడదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై ఎలక్షన్ కమిషన్ గురువారం(మే-2,2019) ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. మోడీ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు రాదని ఈసీ తేల్చి చెప్పింది.
ఏప్రిల్ 21,2019 రాజస్థాన్ లోని బర్మేర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ…పాకిస్తాన్ రోజూ మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని భారత్ ను బెదిరించాలని ప్రయత్నిస్తోంది. మా దగ్గర కూడా న్యూక్లియర్ బటన్ ఉంది.మేము ఏమైనా అణ్వాయుధాలను దీపావళి కోసం దాచుకున్నా.పాక్ బెదిరింపులకు భారత్ భయపడేది లేదని మోడీ అన్నారు.
అయితే మోడీ సైనిక దళాల అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారని,దీపావళి కోసం భారత్ అణ్వాయుధాలను దాచుకోలేదంటూ వ్యాఖ్యానించారని ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. మోడీ ప్రసంగాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారి పంపిన నివేదికను పరిశీలించింది. ప్రధాని వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనేమీ కాదని తేల్చి ఆయకు క్లీన్ చిట్ ఇచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవట్లేదంటూ దాఖలైన పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈసీకి డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే.మే-6,2019లోపల మోడీ,షాపై కేసులపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఈసీని ఆదేశించింది.మోడీ,షాలపై కోడ్ ఉల్లంఘించారంటూ ఇప్పటివరకు 11 కంప్లెయింట్ లు వచ్చాయని,అందిన ఫిర్యాదుల్లో ఇప్పటికే రెండింటిపై మోడీ,షాలకు క్లీన్ చిట్ ఇచ్చామని,మరో 9 ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందందని విచారణ సందర్భంగా ఈసీ కోర్టుకి తెలిపింది.అయితే మోడీ అణ్వాయుధాలపై చేసిన కామెంట్ ఈసీ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇప్పటివరకు మూడు ఫిర్యాదులపై ఈసీ నిర్ణయం తీసుకున్నట్లు అయింది.ఇంకా 8 ఫిర్యాదులపై మే-6లోపల ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.