PM Modi Hyderabad Visit : ముందే వచ్చిన మోదీ.. షెడ్యూల్ మారింది..!
షెడ్యూల్ కన్నా ముందే మోదీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

Pm Modi Hyderabad Visit Small Changes In Schedule
PM Modi Hyderabad Visit : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (మే 26) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. అయితే మోదీ రెండున్నర గంటల పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ కన్నా ముందే మోదీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. మధ్యాహ్నం 1.25 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకోవాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎస్, డీజీపీ ఇతర ప్రోటోకాల్ నేతలు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఐఎస్‌బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.
పర్యటనలో ముందుగా.. బేగంపేట ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 15 నిమిషాల పాటు బీజేపీ నేతలతో మోదీ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, డా. కె లక్ష్మణ్, రాజాసింగ్‌లు మోదీని కలిసే అవకాశాలున్నాయి. రాష్ట్ర రాజకీయాలపై మోదీ చర్చించే అవకాశం ఉంది. బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో హెచ్‌సీయూకి ప్రధాని చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ 2 గంటల సమయంలో ISBకి చేరుకోనున్నారు.

Pm Modi Hyderabad Visit Small Changes In Schedule
మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ఐఎస్బీ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించి.. కొంతమంది విద్యార్ధులుకు స్వయంగా మోదీ పట్టాలను అందించనున్నారు. మధ్యాహ్నం 3.20 నిమిషాలకు కార్యక్రమం ముగియనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మోదీ హెచ్‌సీయూకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలీకాప్టర్ ద్వారా బేగంపేటకు చేరుకుంటారు. ఆపై మధ్యాహ్నం 3.50 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ చెన్నైకు బయల్దేరి వెళ్లనున్నారు.
Read Also : Pm modi: నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. రెండున్నర గంటలు పర్యటన.. షెడ్యూల్ ఇలా..