New Delhi: కొత్త శకం ప్రారంభం.. కర్తవ్యపథ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
New Delhi: నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ విస్టా అవెన్యూ సహా ఇతర అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రులు హర్షదీప్ సింగ్, కిషన్ రెడ్డిలతో కలిసి మోదీ ఈ ప్రారంభోత్సవాన్ని చేపట్టారు.

PM Modi inaugurates all new redeveloped Central Vista Avenue
New Delhi: నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ విస్టా అవెన్యూలోని కొన్ని అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రులు హర్షదీప్ సింగ్, కిషన్ రెడ్డిలతో కలిసి మోదీ ఈ ప్రారంభోత్సవాన్ని చేపట్టారు. రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్గా మార్చిన విషయం తెలిసిందే. ఈ పేరుకు నేటితో అధికారిక సాధికారతను ప్రధాని ఇచ్చారు. 3కిలోమీటర్ల మేర ఉన్న ఈ కర్తవ్యపథ్‌లో నడక మార్గాలు, కాలువలు, పచ్చిక సహా ఇతర ప్రదేశాలను అధునాతనంగా తీర్చిదిద్దారు. ఇక ఇదే ప్రదేశంలో నిర్మించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని సైతం మోదీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ‘‘వలసవాదానికి చిహ్నంగా ‘కింగ్స్’ ఇక చరిత్రలో మాత్రమే ఉంటుంది. అయితే దీన్ని ఎవరూ చెరిపివేయలేరు. కానీ దీనికి కర్తవ్యపథ్ రూపంలో కొత్త శకం ప్రారంభమైంది. పూర్తి భారతీయవాదం వచ్చింది. మనతో పాటు మరో చిహ్నాం వలసవాదం నుంచి బయటికి వచ్చినందుకు దేశ ప్రజలందరినీ అభినందిస్తున్నాను’’ అని అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఇండియా గేట్ సమీపంలోని ప్రాంతాలన్నీ విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోయాయి. ఈ కార్యక్రమానికి ముందు సెంట్రల్ విస్టా అవెన్యూ నిర్మాణానికి పని చేసిన వారిని మోదీ కలుసుకున్నారు. వారందరినీ జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకల పరేడ్కి ఆహ్వానిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఇక్కడే పునరుద్దరించిన ఎగ్జిబిషన్‌ను మంత్రులతో కలిసి సందర్శించారు.
సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం రూ.13,450 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీనిలో భాగంగానే కర్తవ్య పథ్‌ను అభివృద్ధి చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో త్రికోణాకారంలో ఉండే పార్లమెంటు భవనం, సెంట్రల్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి నివాసం, కార్యాలయం, ఉప రాష్ట్రపతి నివాసం, కార్యాలయం నిర్మితమవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో మొదట పూర్తయినది కర్తవ్య పథ్. ఇక్కడ ఆహ్లాదకరమైన పార్కులు, అద్భుతమైన లైటింగ్, మనసును దోచుకునే పచ్చదనం వంటి ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి.
Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-II మరణిస్తే.. ఆ తర్వాత నిర్వహించే కార్యక్రమాలు ఏముంటాయి?