మూడోసారి సీఎంలతో మోడీ భేటీ..

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 05:33 AM IST
మూడోసారి సీఎంలతో మోడీ భేటీ..

Updated On : April 28, 2020 / 5:33 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఏప్రిల్ 27న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై పరిస్థితులు సమీక్షించనున్నారు. కరోనావైరస్ మహమ్మారి ప్రబలిన సమయంలో వ్యాప్తిని అడ్డుకోవడానికి రెండు సార్లు లాక్ డౌన్ పొడిగించింది సీఎంల వీడియో కాన్ఫిరెన్స్ తర్వాతే. 

మార్చి 20న తొలి సమావేశంలో పాల్గొన్న మోడీ.. మార్చి 22న జనతా కర్ఫ్యూ నిర్వహించి ఆ తర్వాత మార్చి 24 నుంచి 21 రోజుల లాక్‌డౌన్ విధించారు. రెండోసారి ఏప్రిల్ 11న వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న పీఎం మోడీ.. లాక్‌డౌన్ ను మరికొద్ది రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపారు. 

మూడోసారి ఏప్రిల్ 27న సమావేశమయ్యే క్రమంలో ఈ సారి ఎటువంటి సంచలన నిర్ణయం ఉంటుందోనని ప్రజలు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. మే3న ముగిసే లాక్ డౌన్ పొడిగిస్తారా.. లేదా చూడాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే మే8 వరకూ కొనసాగుతుందని సంచలన ప్రకటన చేసేశారు.