PM Modi Record : ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయనం
PM Modi Record : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది.
PM Modi becomes longest serving head of govt Held both CM and PM posts for 8931 days
PM Modi Record : ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. మన దేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. నేడు మార్చి 22, ఆదివారం రోజున ఈ అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. తాజాగా మోదీ.. సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించారు. పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట 8,930 రోజుల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన రికార్డు ఉండేది. తాజాగా మోదీ దానిని అధిగమించారు.
మార్చి 22 (ఆదివారం) నాటికి గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా ప్రభుత్వాధినేత హోదాలలో నరేంద్ర మోదీ 8,931 పనిదినాలను పూర్తి చేసుకున్నారు. దీంతో పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డు బద్దలైంది. ప్రధాన మంత్రి కాకముందు మోదీ.. దీర్ఘకాలం పాటు గుజరాత్ సీఎంగా వ్యవహరించి రికార్డు క్రియేట్ చేశారు. వరుసగా నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా సేవలందించారు.
గుజరాత్ సీఎంగా మోదీ పదవీ కాలం:
- 2001 అక్టోబరు 7 నుంచి 2002 డిసెంబరు 22 వరకు
- 2002 డిసెంబరు 22 నుంచి 2007 డిసెంబరు 22 వరకు
- 2007 డిసెంబరు 23 నుంచి 2012 డిసెంబరు 20 వరకు
- 2012 డిసెంబరు 20 నుంచి 2014 మే 22 వరకు నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ బాధ్యతలు నిర్వహించారు.
అలాగే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి ప్రధానమంత్రిగానూ మోదీ నిలిచారు. 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయాల్లో మోదీ పాత్రే కీలకం. స్వాతంత్య్రానంతరం జన్మించి, దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి నేతగా మోదీ నయా రికార్డు క్రియేట్ చేశారు. అలాగే కేంద్రంలో రెండు సార్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని, మూడోసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర నేతగా కూడా రికార్డు నెలకొల్పారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రెండో నేతగా కూడా మోదీ నిలిచారు.
