Skanda Sashti : మార్చి 24న ‘స్కంద షష్టి’.. ఆరోజు ఇలాచేస్తే మీకష్టాలన్నీ తీరిపోతాయ్.. ముఖ్యంగా వారికి అద్భుతమైన రోజు..
Skanda Sashti : స్కంద సష్టి అనేది ప్రతి సంవత్సరం కుమార స్వామికి అంకింతం చేసే పండుగ. శివపార్వతుల తనయుడు, వినాయకుడినికి తమ్ముడిని స్కంధుడిని సుబ్రహ్మణ్య అని కూడా పిలుస్తారు. స్కందషష్టి ప్రధానంగా శ్రీలంక, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుపుకుంటారు.
Skanda Sashti
Skanda Sashti : గ్రహ దోషాలు, కుజ దోషం, వివాహం ఆలస్యం, రుణ బాధలు, చర్మ రోగాలు.. ఇలా పలు సమస్యలతో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? ఆ సమస్యల నుంచి బయటపడేందుకు అద్భుత అవకాశం వచ్చింది. మార్చి 24 (మంగళవారం) స్కంద షష్టి. ఆ రోజు ప్రత్యేక పూజల్లో పాల్గొంటే కష్టాలన్నీ తీరపోతాయని పలువురు పండితులు పేర్కొంటున్నారు.
స్కంద సష్టి అనేది ప్రతి సంవత్సరం కుమార స్వామికి అంకింతం చేసే పండుగ. శివపార్వతుల తనయుడు, వినాయకుడినికి తమ్ముడిని స్కంధుడిని సుబ్రహ్మణ్య అని కూడా పిలుస్తారు. స్కందషష్టి ప్రధానంగా శ్రీలంక, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఇక వ్యక్తి జాతకంలో కుజ దోషం ఉన్నట్లయితే వివాహం కావడంలో ఆలస్యం, సంతానం కలగడంలో ఇబ్బందులు వంటివి ఉంటాయి. అలాగే ఈ కుజ గ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. కుజ దోషాలు తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్యుని ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి.
ఇలా చేయండి..
♦ స్కంధ షష్టి మంగళవారం (మార్చి 24)న వస్తుంది. స్కంద షష్టి తిథి 23వ తేదీ (సోమవారం) సాయంత్రం 6.38గంటలకు ప్రారంభమవుతుంది. 24వ తేదీ సాయంత్రం 4.48గంటకు ముగుస్తుంది.
♦ స్కంధ షష్టి రోజు కుజ దోషం, వివాహ సమస్యలు ఉన్నవారు ఎర్రటి ఒత్తూలతో (లేదా తెల్లటి ఒత్తులకు కుంకుమ పెట్టి) నువ్వుల నూనెతో ఆరు దీపాలు వెలిగించడం శుభపద్రం
♦ రుణ బాధలు ఉన్నవారు.. ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి స్వామివారి ముందు నెయ్యితో దీపం పెట్టి అందులో కొద్దిగా ఎర్ర చందనం లేదా కుంకుమ వేసి దీపారాధన చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి.
♦ సంతానంకోసం ప్రయత్నం చేస్తున్న వారు ఆవు నెయ్యితో ఆరు ఒత్తులతో ఏక దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలను ఇస్తుంది.
♦ సాధ్యమైతే సాయంత్రం వేళ సుబ్రహ్మణ్య స్వామివారి ఫోటో లేదంటే విగ్రహం ఎదుట షడ్బుజి ఆకారం (ఆరు కోణాలు) వేసి ఆరు ప్రమిదలు ఉంచాలి. ఇలా చేస్తే ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి విజయాలు లభించే అవకాశం ఉంటుంది.
స్కంద షష్టి పూజ ఆచారాలు:
♦ భక్తులు మురుగన్ ఆలయాలను దర్శించుకోవచ్చు లేదంటే ఇంట్లోనే సాధారణ పూజ చేసుకోవచ్చు
♦ మీ ఇంటిని శుభ్రం చేసి, మురుగన్ చిత్రపటం లేదంటే విగ్రహం ఏర్పాటు చేసుకొని పూజు చేసుకోవచ్చు.
♦ దీపం వెలిగించి, నైవేద్యంగా పువ్వులు, పండ్లు లేదంటే కొబ్బరికాయను సమర్పించండి.
♦ ఏకాగ్రత, రక్షణ కోసం రోజంతా మురుగన్ మంత్రాలను జపించండి.
♦ కొంతమంది భక్తులు మానసిక స్పష్టత కోసం స్కంద షష్ఠి కవచాన్ని పఠిస్తారు.
గమనిక: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని 10v ధృవీకరించడం లేదు.
