Idols in Pooja Room : ఇంటి పూజ గదిలో ఎన్ని విగ్రహాలుంటే మంచిది.. ఈ దేవతా ఫొటోలు అస్సలు పెట్టకూడదు..!
Idols in Pooja Room : పూజా మందిరంలో ఎన్ని విగ్రహాలు పెట్టాలి.. ఏ దేవుళ్ల విగ్రహాలు పెట్టకూడదనే వివరాలు..
vastu tips how many idols should be in your home pooja room which gods photos not placed
Idols in Pooja Room : ప్రతి ఇంటిలో దేవుడి కోసం ప్రత్యేకంగా గది ఉంటుంది. అద్దె ఇళ్లలో అయితే కొన్ని అరలు, ప్రత్యేక మందిరాలు ఏర్పాటు చేసుకుంటారు. కొందరు నిత్యం దీపారాధన చేస్తారు. పూజ గదిని చాలా పవిత్రంగా భావిస్తారు. పూజ గదిలోకి ప్రవేశించడానికి ప్రత్యేక నియమాలు పాటించేవారు కూడా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఇంటిలో ప్రతి రోజూ పూజ చేసి, దీపారాధన చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న పూజ గదికి సంబంధించి కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి అంటున్నారు పండితులు.
పూజ గదిలో విరిగిన, పాడైపోయిన వస్తువులు ఉంచకూడదంటున్నారు.
పూజ గది స్వచ్ఛతకు గుర్తు. ఇది ఎంత అందంగా ఉంటే ఇంటిలో అంత సానుకూలత ఉంటుంది అంటున్నారు.
పూజ గది గంధరగోళంగా ఉంటే, ఇంటిలోని వారందరూ చాలా గందరగోళానికి గురి అవుతుంటారని హెచ్చరిస్తున్నారు.
అలానే వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో ఎన్ని విగ్రహాలు ఉండాలో చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఇప్పుడు మనం ఇంటిలో పూజ గదిలో ఎన్ని విగ్రహాలు ఉండటం శుభప్రదమో చూద్దాం.
- వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పూజ గదిలో రెండు నుంచి ఐదు విగ్రహాలు ఉంటే మంచిదంటున్నారు.
- ఇది ఇంటిలో సానుకూల శక్తిని పెంచడమే కాక సమస్యలను నివారిస్తుందంటున్నారు.
- అలానే ఉగ్రరూపంలో ఉన్నవి కాకుండా, శాంత స్వభావంతో ఉన్న విగ్రహాలను మాత్రమే ఇంటి పూజ గదిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
- ముఖ్యంగా, నటరాజ స్వామి, శని, రాహు కేతువుల ఉగ్ర రూపాలను వర్ణించే విగ్రహాలు, పటాలను ఇంటి పూజ గదిలో ఉంచకూడదట.
- అలాగే కాళీమాత, కాలభైరవుని ఉగ్ర రూపాన్ని వర్ణించే పటాలు, విగ్రహాలను కూడా ఇంటి గుడిలో ఉంచకూడదని చెబుతున్నారు.
- అటువంటి విగ్రహాలు తీవ్రమైన శక్తికి, తపస్సుకు చిహ్నాలుగా భావిస్తారని.. అలాంటి విగ్రహాలను పూజ గదిలో ఉంచితే సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.
నోట్ : ఈ వార్తలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. 10tv తెలుగు దీనిని ధృవీకరించడంలేదు.
