PM Modi on India Name Change: సనాతన ధర్మం, ఇండియా-భారత్ వివాదాలపై స్పందించిన ప్రధాని మోదీ.. మంత్రులకు కీలక సూచనలు
భారతదేశ అధ్యక్షతన సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు ఢిల్లీలో G-20 సమ్మిట్ నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు దేశాధినేతలు ఇందులో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ-20 విందును ఏర్పాటు చేయనున్నారు.

PM Modi on Sanatana Dharma Controversy: గత మూడు-నాలుగు రోజుల నుంచి దేశంలో విస్తృతంగా చర్చలో ఉన్న అంవాలు సనాతన ధర్మ వివాదం, ఇండియా-భారత్ పేరు మార్పు. ఈ రెండు అంశాలపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల అనంతరం వివాదం చెలరేగింది. ఇక జీ-20 సమావేశం సందర్భంగా ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటూ రాయడంతో ఇండియా-భారత్ అంశం చర్చలోకి వచ్చింది. అయితే ఈ రెండు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం స్పందించారు. అంతే కాకుండా ఈ రెండు అంశాలపై తన మంత్రి వర్గానికి కీలక సూచనలు చేశారు.
బుధవారం (సెప్టెంబర్ 6) జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఇండియా-భారత్ వివాదంపై ఏమీ మాట్లాడవద్దని మంత్రులకు ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే సనాతన ధర్మ వివాదంపై షరతులతో మాట్లాడేందుకు ప్రధాని అనుమతి ఇచ్చారు. జీ-20 సమావేశంలో అధికారం కలిగిన వ్యక్తి తప్ప మరే ఇతర మంత్రి మాట్లాడకూడదని తన మంత్రులకు మోదీ చెప్పారని ప్రభుత్వ వర్గాల సమాచారం. 9వ తేదీన నిర్వహించే విందుకు హాజరయ్యే మంత్రులు తమ సొంత వాహనాల్లో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌కు చేరుకుని బస్సుల్లో సభా వేదిక వద్దకు వెళ్లాలని ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది.
విందు విషయంలో మంత్రులకు ప్రధాని సలహా
విందుకు ఆహ్వానించిన ముఖ్యమంత్రి కూడా తన అనుచరగణంతో పార్లమెంటు భవన సముదాయానికి చేరుకుని అక్కడి నుంచి బస్సుల్లో వెళ్తారు. విందు కోసం మంత్రులు, ముఖ్యమంత్రr సాయంత్రం 5:50 గంటలకు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌కు చేరుకుని 6:30 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకోవాలి.
ఢిల్లీలో జీ-20 సదస్సు
భారతదేశ అధ్యక్షతన సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు ఢిల్లీలో G-20 సమ్మిట్ నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు దేశాధినేతలు ఇందులో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ-20 విందును ఏర్పాటు చేయనున్నారు.