BIG BREAKING : జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.

BIG BREAKING : జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ

Moci Mankibath

Updated On : April 20, 2021 / 8:33 PM IST

PM Modi దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు,మరణాల సంఖ్య భారీగా నమోదవుతుంది. రికార్డు స్థాయిలో రోజుకి 2లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్,కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 8:45గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. కోవిడ్ పై కీలక ప్రకటన చేయనున్నారు. దేశంలో కరోనా పరిస్థితి,ప్రభుత్వ చర్యల గురించి ప్రధాని మోడీ ప్రస్తావించనున్నారు. అయితే,ప్రధాని మోడీ మళ్లీ లాక్ డౌన్ ప్రకటన చేయబోతున్నారా అన్న టెన్షన్ అందరిలో నెలకొంది.