Tripura : భారత్ – బంగ్లా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో భారత్ - బంగ్లా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు.

Tripura
Tripura : ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 4న త్రిపురలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన మహారాజ బీర్ బిక్రమ్ విమానాశ్రయంలో రూ.3,400 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనను ధ్రువీకరిస్తూ పీఎంఓ నుంచి కాల్ వచ్చినట్లుగా సీఎంఓ తెలిపింది. ఇక ప్రధాని పర్యటనలో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదియా సింధియా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సీనియర్ అధికారులు, కూడా పాల్గొంటారని తెలిపారు.
చదవండి : PM Modi: అభివృద్ధి శిఖరాలను అధిరోహిస్తూనే ఉంటాం – ప్రధాని మోదీ
ఇక రాష్ట్రానికి ప్రధాని వస్తున్న నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు బీఎస్ఎఫ్ అధికారులు. వివిఐపీల పర్యటనల సమయంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సరిహద్దుల్లో భద్రతా కట్టుదిట్టం చేస్తోంది సైన్యం.. ఈ నేపథ్యంలోనే జనవరి 1 నుంచి సరిహద్దుల్లో మరిన్ని బలగాలు మోహరించారు. అడుగడుగు క్షున్నంగా తనిఖీ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు జరిగే అవకాశం ఉండటంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మానిటరింగ్ కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.
చదవండి : PM Modi UAE Tour : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ యూఏఈ పర్యటన రద్దు