Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు విసిరి కలకలం రేపిన దుండగులు
హౌరా-ఎన్జేపీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై కొందరు దుండగులు రాళ్లు విసిరి కలకలం రేపారు. నాలుగు రోజుల క్రితమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా (వర్చువల్ పద్ధతిలో) హౌరా-ఎన్జేపీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. దాని కమర్షియల్ సేవలు ప్రారంభమైన రెండవ రోజే దానిపై దుండగులు రాళ్లు విసరడం గమనార్హం.

First Vande Bharat Express trial run
Vande Bharat Express: హౌరా-ఎన్జేపీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై కొందరు దుండగులు రాళ్లు విసిరి కలకలం రేపారు. నాలుగు రోజుల క్రితమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా (వర్చువల్ పద్ధతిలో) హౌరా-ఎన్జేపీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. దాని కమర్షియల్ సేవలు ప్రారంభమైన రెండవ రోజే దానిపై దుండగులు రాళ్లు విసరడం గమనార్హం.
న్యూ జల్పైగురి వైపు వందే భాత్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తున్న సమయంలో కుమార్‌గంజ్ స్టేషన్ వద్ద నిన్న సాయంత్రం 5.10 గంటలకు సీ-13 కోచ్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో కంపార్టుమెంటు డోరు గ్లాసు విరిగిపోయింది. మాల్దాలో ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరైనా గాయపడ్డారా? అన్న విషయంపై వివరాలు తెలియరాలేదు.
దుండగులు ఉద్దేశపూర్వకంగానే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును లక్ష్యంగా చేసుకుని దాడి చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. మరో 20-25 కిలోమీటర్లు వెళ్తే ఆ రైలు మాల్దా స్టేషన్ చేరుకుంటుందనగా ఈ రాళ్లదాడి జరిగిందని చెప్పారు. రైలు మెయిన్ డోర్ ధ్వంసమైందని తెలిపారు.
Viral Video: పెళ్లి కూతురును ఎత్తుకునేందుకు ప్రయత్నించిన పెళ్లి కొడుకు.. ఇద్దరూ ఎలా పడ్డారో చూడండి