PM Modi Interaction With Officials : కరోనా ఓ కుట్రధారి.. వ్యాక్సిన్ వృథాను ఆపాలన్న ప్రధాని
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అనుసరించే వ్యూహాలు.. క్రియాశీలకంగా, సరికొత్తగా,ఎప్పటికప్పుడు మార్పు చెందే విధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలిపారు.

Pm Modi Interaction With Officials
PM Modi Interaction With Officials కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అనుసరించే వ్యూహాలు.. క్రియాశీలకంగా, సరికొత్తగా,ఎప్పటికప్పుడు మార్పు చెందే విధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలిపారు. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 54 జిల్లాల కలెక్టర్ లు, క్షేత్రస్థాయి అధికారులతో గురువారం ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. సమావేశంలో ఛత్తీస్‌గఢ్, హర్యానా, కేరళ,ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ అధికారులు పాల్గొన్నారు.
కరోనా కట్టడి తీసుకుంటున్న చర్యలను, ప్రణాళికలను అధికారులు ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడి చర్యలపై ప్రధాని ఆరా తీశారు. ఈ సందర్భంగా వైరస్ను ‘కుట్రధారి’, ‘బహురూపకారి’గా ప్రధాని అభివర్ణించారు. దేళ్లలో వచ్చిన అతిపెద్ద విపత్తు కరోనా అన్నారు. కరోనా వైరస్ కారణంగా జిల్లా అధికారులు..తమ విధులు నిర్వర్తించటం సవాల్ గా మారిందన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో మహమ్మారిపై పోరాడాలన్నారు. కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెంది వ్యాప్తి చెందుతోందన్నారు. కోవిడ్ బారిన పడిన పిల్లల డేటా సేకరించాలని ప్రధాని జిల్లా అధికారులను కోరారు. కాగా, కరోనా మూడవ దశ పిల్లలపై ఎక్కువగా ప్రభావితం చూపుతుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు మరియు పరిస్థితిని ఎదుర్కోవటానికి ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచాలని పిలుపునిచ్చారు.
రాబోయే రోజుల్లో యువత, చిన్నారులపై వైరస్ అధిక ప్రభావం చూపుతుందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో.. అధికారులు దృష్టిసారించాలని సూచించారు. జిల్లాల్లో మహమ్మారి వ్యాప్తిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి వైరస్ తీవ్రతను అంచనా వేయాలని ప్రధాని సూచించారు. ప్రస్తుతం ఉన్న వనరులను ఉపయోగించుకుని వైరస్ను సమర్థవంతంగా కట్టడి చేస్తున్న జిల్లా అధికారులను మోడీ ప్రశంసించారు. కేసులు తగ్గినా.. వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేంత వరకూ కృషి చేయాలని సూచించారు.
ప్రజలు తమ జీవనాన్ని సులభతరం చేసేందుకు ఉచిత రేషన్, ఇతర నిత్యావసర సామగ్రి అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ప్రధాని కోరారు. ప్రాణాలు కాపాడడడంతో పాటు ప్రతి వ్యక్తి జీవన సౌలభ్యం తమ ప్రాధాన్యతని ప్రధాని తెలిపారు. పేదలకు ఉచిత రేషన్ సౌకర్యాలు ఉండాలని, నిత్యావసర సరుకులు బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా చూడాలన్నారు. ఇవన్నీ పోరాటంలో గెలిచేందుకు, ముందుకు సాగేందుకు అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు.
ఇక, వ్యాక్సిన్ వృథాపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని.. టీకా వృథాను ఆపడం అత్యంత ముఖ్యమన్నారు. ఒక్కో డోసు వృథా.. ఒక జీవితానికి రక్షణ కల్పించే అవకాశం వృథా అయినట్టేనన్నారు. నూతన సవాళ్లే.. సరికొత్త పరిష్కారాలను చూపుతాయన్నారు. వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని.. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అధికారులంతా పర్యవేక్షించాలని కోరారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ల సరఫరాపై స్పందిస్తూ ఆరోగ్య మంత్రిత్వశాఖ 15 రోజుల పాటు టీకాలకు సంబంధించిన సమాచారం రాష్ట్రాలకు అందిస్తుందని, వ్యాక్సినేషన్‌లో సహాయపడుతుందన్నారు.