కరోనాపై ఫైట్…పర్శనల్ సేవింగ్స్ నుంచి 25వేలు విరాళమిచ్చిన మోడీ తల్లి

  • Published By: venkaiahnaidu ,Published On : March 31, 2020 / 01:22 PM IST
కరోనాపై ఫైట్…పర్శనల్ సేవింగ్స్ నుంచి 25వేలు విరాళమిచ్చిన మోడీ తల్లి

Updated On : March 31, 2020 / 1:22 PM IST

కరోనా వైరస్(COVID-19) పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్. తన వ్యక్తిగత సేవింగ్స్ నుంచి 25వేల రూపాయలను పీఎం-కేర్స్  ఫండ్ కు ఆమె విరాళమిచ్చారు.

కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఇటీవల ప్రధానమంత్రి మోడీ ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిస్ట్యువేషన్స్ (PM-CARES) నిధిని ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న యుద్ధానికి విరాళం ఇవ్వాలని  అన్ని వర్గాల ప్రజలు తమ కోరికను వ్యక్తం చేశారు. ఆ స్ఫూర్తిని గౌరవిస్తూ PM-CARES ఫండ్ ను మోడీ ఏర్పాటు చేశారు.ఇది ఆరోగ్యకరమైన భారత నిర్మాణంలో ఇది చాలా దూరం వెళ్తుంది.

తోటి భారతీయులు దయచేసి పీఎమ్-కేర్స్ ఫండ్ కు తమ వంతు సహకారం అందించాలని తాను విజ్ణప్తి చేస్తున్నట్లు ఆ తర్వాత ఓ ట్వీట్ లో మోడీ కోరారు. PM-CARES పలువురు ప్రముఖులు,సామాన్యులు,వ్యాపారులు ఇలా అందరూ తమ వంతు విరాళాలను ప్రకటిస్తూనే ఉన్నారు.