ప్రపంచ దేశాలకు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఇకపై..

టెర్రరిజం, నీటి పంపిణీ కూడా ఏకకాలంలో ఉండవని అన్నారు.

ప్రపంచ దేశాలకు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఇకపై..

Modi

Updated On : May 12, 2025 / 9:34 PM IST

ఆపరేషన్ సిందూర్‌పై జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ అంశం, పాకిస్థాన్‌తో చర్చలు వంటి వాటిపై ప్రపంచానికి భారత వైఖరిని స్పష్టం చేశారు.

“ప్రపంచానికి చెబుతున్నా.. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే అది టెర్రరిజం, పీవోకే మీదే. ఏదో ఒకరోజు ఉగ్రవాదం పాకిస్థాన్నే మింగేస్తుంది. న్యూ ఏజ్ వార్ ఫేర్ కి మేం రెడీ. ఉగ్రవాదులను ఖండఖండాలుగా చీల్చి చెండాడాం.

ఈ యుగం యుద్ధానిది కాదు, టెర్రరిజానిది కాదు. 21వ శతాబ్దం మేడిన్ ఇండియా ఆయుధాలదే. ఇండియా దెబ్బకు పాక్ భయపడింది. పాకిస్థాన్‌ను కాపాడాలని ప్రపంచ దేశాలను పాక్‌ అడుక్కుంది” అని చెప్పారు.

Also Read: మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై భారీ డిస్కౌంట్‌.. అద్భుతమైన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇలా తక్కువ ధరకే కొనుక్కోండి..

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా భారత్‌ వెనుకాడదని మోదీ చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఎవరినీ ఉపేక్షించబోమని అన్నారు. పాకిస్థాన్ బతకాలంటే ఉగ్రవాద క్యాంపులను తనంతట తానుగా నాశనం చేయాలని చెప్పారు.

ఉగ్రవాదం, చర్చలు రెండూ ఏకకాలంలో ఉండబోవని స్పష్టం చేశారు. అలాగే, టెర్రరిజం, వాణిజ్యం కూడా రెండూ ఏకకాలంలో ఉండబోవని అన్నారు. టెర్రరిజం, నీటి పంపిణీ కూడా ఏకకాలంలో ఉండవని అన్నారు.