మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై భారీ డిస్కౌంట్.. అద్భుతమైన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇలా తక్కువ ధరకే కొనుక్కోండి..
Motorola Edge 50 Pro: బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.

Motorola Edge 50 Pro: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇది నిజంగా శుభవార్త. ప్రీమియం ఫీచర్లతో వచ్చిన మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని రీతిలో భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. హై-ఎండ్ ఫీచర్లతో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. మీరు మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కొనాలనుకుంటే ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి..
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆఫర్
♦ ఈ ఫోన్‌పై ఏకంగా 24% వరకు నేరుగా తగ్గింపు లభిస్తోంది.
♦ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.41,999.
♦ కానీ, ఫ్లిప్‌కార్ట్ సేల్ లో ఇవాళ ఈ ఫోన్ కేవలం రూ.27,999కే అందుబాటులో ఉంది.
♦ అంటే, మీరు నేరుగా రూ.12,000 తగ్గింపు పొందవచ్చు.
బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్లు
♦ ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొంటే అదనంగా 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
♦ అంతేకాదు, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ.27,700 వరకు ఎక్స్చేంజ్ విలువను పొందవచ్చు. మీ పాత ఫోన్ మోడల్ అలాగే కండిషన్‌ను బట్టి ఈ విలువ మారుతుంది.
♦ ఒకవేళ మీ పాత ఫోన్‌కు పూర్తి ఎక్స్చేంజ్ విలువ లభిస్తే.. మీరు మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్‌ను కేవలం రూ.2,000కే సొంతం చేసుకునే అవకాశం ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫీచర్లు
డిజైన్: అల్యూమినియం ఫ్రేమ్, ఈకో ఫ్రెండ్లీ లెదర్ బ్యాక్ ఫినిషింగ్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.
డిస్‌ప్లే : 6.7 ఇంచుల అద్భుతమైన P-OLED డిస్‌ప్లేతో ఉంది. స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ కోసం 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. డిస్‌ప్లేకు Corning Gorilla Glass ప్రొటెక్షన్ ఉంది.
ఆపరేటింగ్ సిస్టమ్ : లేటెస్ట్ Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
మెమరీ, స్టోరేజ్ : ఈ ఆఫర్‌లో మీరు పొందుతున్న వేరియంట్ 12GB RAM, 512GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
కెమెరాలు : బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది: 50MP ప్రధాన కెమెరా, 10MP టెలిఫొటో లెన్స్ 13MP అల్ట్రా వైడ్ కెమెరా. ఫ్రంట్ సైడ్ 50MP హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరా ఉంది.
బ్యాటరీ, ఛార్జింగ్ : 4500mAh బ్యాటరీ మంచి బ్యాకప్‌ను ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
(చదవండి: OnePlus 13s వచ్చేస్తోంది.. ఇండియాలో లాంచ్ వివరాలు లీక్.. ఫీచర్లు అదరహో )
ఈ డీల్ మిస్ కావద్దు
ఫ్లిప్‌కార్ట్ సేల్ లో Motorola Edge 50 Pro పై లభిస్తున్న రూ.12,000 తగ్గింపు, అదనపు బ్యాంక్/ఎక్స్చేంజ్ ఆఫర్లతో కలిపి, ఈ ఫోన్‌ను సుమారు రూజ13,000 ధరలోనే పొందే అవకాశం ఉంది (ఎక్స్చేంజ్, బ్యాంక్ ఆఫర్లు పూర్తిగా వర్తిస్తే). ప్రీమియం ఫీచర్లు (P-OLED 144Hz డిస్‌ప్లే, Snapdragon ప్రాసెసర్, మంచి కెమెరాలు, స్టైలిష్ డిజైన్) కావాలనుకునే వారికి ఈ ధరలో ఇది చాలా మంచి డీల్.
నోట్: ఈ ఆఫర్ ఈ ఆర్టికల్ రాసే సమయానికి అందుబాటులో ఉంది. మీరు కొనుగోలు చేసేముందు ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్/యాప్‌ను చూడండి. ఆఫర్లు ప్రతిరోజు మారుతుంటాయి.