దూసుకొస్తున్న ఫోని…మోడీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్
ఫోని తుఫాన్ దూసుకువస్తున్న సందర్భంగా ఇవాళ (మే-2,2019) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

ఫోని తుఫాన్ దూసుకువస్తున్న సందర్భంగా ఇవాళ (మే-2,2019) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
ఫోని తుఫాన్ దూసుకువస్తున్న సందర్భంగా ఇవాళ(మే-2,2019) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. తుఫాన్ వేళ తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో రివ్యూ చేశారు. క్యాబినెట్ సెక్రటరీ,ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రధాని అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం సెక్రటరీ, ఐఎండీ, ఎన్డీఆర్ఎఫ్, ఎన్‌డీఎంఏ, పీఎంవో నుంచి ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
శుక్రవారం(మే-3,2019) ఉదయం 5.30 గంటలకు ఫోని తుఫాన్.. ఒడిశా రాష్ట్రంలోని పూరీ – చిలికా మధ్య తీరం దాటనుంది. ఇప్పటికే అక్కడ బలమైన గాలులు వీస్తున్నాయి. తీరం వెంట ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. దాదాపు అయిదేళ్ల తర్వత ఓ భారీ తుఫాన్ ఒడిశా తీరాన్ని తాకుతున్నది. తుఫాను కారణంగా తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది.
ఏప్రిల్-25వ తేదీ నుంచే ఒడిశా తీరాన్ని పెట్రోలింగ్ చేస్తున్నట్లు కోస్టు గార్డు ఐజీ పరమేశ్ తెలిపారు. జాలర్లకు వాతావరణ హెచ్చరికలు ఎప్పటికప్పుడు చేశామన్నారు. 8 రెస్క్యూ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయని, విశాఖ, చెన్నైలో భారీ షిప్ లు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. రిలీఫ్ వర్క్ కోసం హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.