ప్రధానమంత్రి కార్యాలయం కాదు ప్రచారమంత్రి కార్యాలయం

  • Published By: venkaiahnaidu ,Published On : March 20, 2019 / 03:46 PM IST
ప్రధానమంత్రి కార్యాలయం కాదు ప్రచారమంత్రి కార్యాలయం

Updated On : March 20, 2019 / 3:46 PM IST

ప్రధానమంత్రి కార్యాలయం(PMO)ప్రచారమంత్రి కార్యాలయంగా మారిపోయిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(మార్చి-20,2019)మణిపూర్ రాజధాని ఇంపాల్ లో పర్యటించిన ఆయన మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.పీఎంవో ఇప్పుడు ప్రచార మంత్రి కార్యాలయంగా మారిందన్నారు. తనను తాను ప్రచారం చేసుకోవడంలో మోడీ చాలా సమర్థుడన్నారు.

సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని కాంగ్రెస్‌ ఒప్పుకోదని, ద్వేషం వల్ల జీవితంలో ఏమీ సాధించలేమని. ప్రేమ, మానవత్వంతోనే అన్నిటినీ సాధించవచ్చన్నారు. భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌ తమ భావజాలాన్నే ఇతర అన్ని విషయాలపై రుద్దాలని భావిస్తున్నాయని పౌరసత్వ బిల్లును ఆమోదం పొందనివ్వమని తెలిపారు.ఆర్థిక రంగం గురించి మోడీకి ఏమీ తెలియదన్నారు.