Lucknow : 2 భార్యలు, 9 పిల్లలు, 6 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న ఆ సోషల్ మీడియా స్టార్‌ను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారంటే?

సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు పోస్టు చేస్తుంటాడు. అమ్మాయిలకు ఎరవేసి ముగ్గులోకి దించుతాడు. ఆ సోషల్ మీడియా స్టార్ మీద 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. పోలీసుల విచారణలో అవాక్కయ్యే నిజాలు బయటపడ్డాయి.

Lucknow : 2 భార్యలు, 9 పిల్లలు, 6 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న ఆ సోషల్ మీడియా స్టార్‌ను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారంటే?

Lucknow

Lucknow : లక్నోకి చెందిన అజీత్ మౌర్య అనే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని అరెస్టు చేయడానికి గల కారణమేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Cheating : కొంపముంచిన అత్యాశ.. 4కోట్లు పోగొట్టుకున్న వృద్ధురాలు, ఘరానా మోసం

లక్నోకి చెందిన అజీత్ మౌర్య (41) సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటాడు. ఇటీవల ఇతనిని పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇతనికి 2 భార్యలు, 9 మంది పిల్లలు, 6 మంది గార్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీరందరినీ పోషించడానికి అజీత్ మౌర్య నేరాలు చేయడం మొదలుపెట్టాడు. దొంగనోట్లు చలామణి చేయడం, స్కీమ్‌ల పేరు చెప్పి జనాలకు టోపీ పెట్టడం వంటివే కాకుండా సోషల్ మీడియాలో మహిళలను ఆకర్షిస్తూ మోసాలు చేయడం మొదలుపెట్టాడు. 6 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న అజీత్ ఇంతమందిని పోషించడం కోసం నేరాలకు పాల్పడుతున్నాడని తెలిసి పోలీసులు సైతం షాకయ్యారు. ఇతనిపై 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి.

USA: పిల్ల‌లు క‌ల‌గ‌డం లేద‌ని డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లిన మ‌హిళ‌.. 34 ఏళ్ల‌కు బ‌య‌ట ప‌డిన మోసం

అజీత్ న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లడానికి ఓ హోటల్‌లో భార్యతో కూర్చుని ప్లాన్ చేస్తుండగా సరోజినీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. అజీత్ 2000 లో సంగీత అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో అతనికి ఏడుగురు పిల్లలు ఉన్నారు. 2019 లో సుశీల అనే మరో మహిళను వివాహమాడాడు. ఆమెతో మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతని కథలో ట్విస్ట్ ఏంటంటే భార్యలకు విలాసవంతమైన జీవితం ఇవ్వడం కోసం మోసాలకు పాల్పడుతున్నాడు. పోలీసులు అతని కాల్ డేటాను పరిశీలించిన తర్వాత ఆరుగురు గార్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని వారంతా సోషల్ మీడియా వేదికగా పరిచయమైనవారని గుర్తించారు. ప్రస్తుతం అజీత్ మౌర్య పోలీసుల అదుపులో ఉన్నాడు.