Darshan Solanki: ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది కులవివక్షతో కాదట.. తేల్చి చెప్పిన అంతర్గత కమిటీ
సోలంకి ఆత్మహత్య మీద ఏర్పాటు చేసిన కమిటీ ముందు అంబేద్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్ సభ్యులు, అంబేద్కరైట్ స్టూడెంట్స్ కలెక్టివ్ సభ్యులు క్యాంపస్‌లో ఉన్న కుల వివక్షను ఎత్తిచూపారు. అయితే వారిలో ఎవరూ సోలంకిని కలవలేదని, అంతే కాకుండా దర్శన్ ఏ విధమైన సమస్యలను ఎదుర్కొంటున్నారో నేరుగా తెలుసుకోలేదని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

‘Poor marks affected Darshan Solanki’, caste discrimination ruled out by IIT Bombay internal panel
Darshan Solanki: కొంత కాలం క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల మరణం దేశాన్ని కుదిపి వేసింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో కుల వివక్ష దాడి భరించలేక రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోగా, ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా విద్యార్థి లోకం భగ్గున లేచింది. ఇది గడిచి ఏడేళ్లైనప్పటికీ, ఇంకా పచ్చిగానే తాకుతుంటుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్న ఐఐటీలో కూడా అచ్చం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న దర్శన్ సోలంకి అనే విద్యార్థి కుల వివక్ష దాడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
Delhi: తన మీద తప్పుడు కేసు పెట్టారని పోలీస్ స్టేషన్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే యూనివర్సిటీ ఏర్పాటు చేసిన అంతర్గత విచారణ కమిటీ ఇందుకు పూర్తి విరుద్దమైన రిపోర్టు ఇచ్చింది. దర్శన్ ఆత్మహత్యకు కుల వివక్ష కారణం కాదని, మార్కులు తక్కువ వచ్చిన కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తేల్చింది. కుల ఆధారిత వివక్షను ఎదుర్కొన్నట్లు నిర్ధిష్ట ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన సోలంకి అనే మొదటి సంవత్సరం కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థి తన సెమిస్టర్ పరీక్షలు ముగిసిన ఒక రోజు తర్వాత ఫిబ్రవరి 12న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Mumbai Rains: ముంబైలో ఆకస్మిక వానలు.. మీమ్స్‌తో రెచ్చిపోతున్న నెటిజన్లు
అతని మరణానికి దారితీసిన పరిస్థితులను పరిశోధించడానికి ఐఐటి-బాంబే కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నంద్ కిషోర్ నేతృత్వంలో 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. మార్చి 2న కమిటీ తన మధ్యంతర నివేదికను సమర్పించిందని, దాని కాపీని కేంద్ర ప్రభుత్వంతో కూడా పంచుకున్నట్లు తెలిసింది. సోలంకి సోదరి మాత్రమే కుల వివక్ష గురించి చెప్పిందని విచారణ కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే సోలంకి మరణించిన మర్నాడే కుటుంబ సభ్యులు కుల వివక్ష గురించి స్పష్టంగా పేర్కొన్నారు.
Mohan Bhagwat: బ్రిటిషర్లకు ముందు ఇండియాలో 70% అక్షరాస్యులట.. అప్పుడు బ్రిటన్‌లో 17%
సోలంకి ఆత్మహత్య మీద ఏర్పాటు చేసిన కమిటీ ముందు అంబేద్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్ సభ్యులు, అంబేద్కరైట్ స్టూడెంట్స్ కలెక్టివ్ సభ్యులు క్యాంపస్‌లో ఉన్న కుల వివక్షను ఎత్తిచూపారు. అయితే వారిలో ఎవరూ సోలంకిని కలవలేదని, అంతే కాకుండా దర్శన్ ఏ విధమైన సమస్యలను ఎదుర్కొంటున్నారో నేరుగా తెలుసుకోలేదని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
Dalit IIT Student: ఐఐటీ బాంబేలో మరో రోహిత్ వేముల.. కుల వివక్ష దాడి భరించలేక విద్యార్థి ఆత్మహత్య
కుటుంబంతో ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత విషాద సంఘటనకు ముందు సమయంలో ఏమి జరిగిందనే దానిపై కమిటీకి వద్ద ఎలాంటి సమాచారం లేదు. అంతే కాకుండా కాల్ వివరాలు, ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఫోరెన్సిక్ విశ్లేషణ, దర్శన్ పోస్ట్-మాడర్న్ నివేదిక ఏదీ కమిటీ వద్ద లేదు. ఇవేవీ లేకుండానే సోలంకి మరణంపై నివేదిక ఇచ్చింది. మార్కులు తక్కువ వచ్చాయని కమిటీ చెప్తోంది కానీ, సోలంకి బాగా చదువుతాడని కుటుంబ సభ్యులు ముందు నుంచి చెప్తున్నారు.