Ajit Pawar: అజిత్ పవార్‌ను మహారాష్ట్ర సీఎంగా చూపుతూ పోస్టర్లు  

సీఎం పదవిపై తనకు ఆసక్తి ఉందని అజిత్ పవార్ కూడా గతంలో ఓ సారి అన్నారు. 

Ajit Pawar: అజిత్ పవార్‌ను మహారాష్ట్ర సీఎంగా చూపుతూ పోస్టర్లు  

Updated On : November 22, 2024 / 5:30 PM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు పూణెలో ఎన్సీపీ (ఏపీ) అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను ముఖ్యమంత్రిగా పేర్కొంటూ పోస్టర్‌ వెలియడం కలకలం రేపుతోంది.

ఈ పోస్టర్‌ను పార్టీ నాయకుడు సంతోష్ నంగారే వేయించారు. దాన్ని చివరకు అక్కడి నుంచి తీయించారు. కొన్ని నెలల క్రితం ఎన్సీపీ నుంచి బయటకు వచ్చిన అజిత్ పవార్ ఆ పార్టీని రెండుగా చీల్చిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత బీజేపీతో కలిసి ఆయన వర్గం వారు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ షిండే ఉన్నారు. అజిత్ పవార్ మద్దతుదారులు ఆయనను సీఎంగా చూడాలని అనుకుంటున్నారు.

మహారాష్ట్రలో మహాయుతి గెలిస్తే సీఎం ఎవరు అవుతారు? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్వతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోస్టర్టు వెలిశాయి. అజిత్ పవార్ సీఎం అంటే సంతోష్ నాంగ్రే పేరుతో పలువురు బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. సీఎం అజిత్ పవార్‌కు అభినందనలు అని అందులో పేర్కొన్నారు.

ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారంటూ అందులో రాసుకొచ్చారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఈ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లోనే పోటీ చేసింది. ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన ఫలితాల ప్రకారం.. మహాయుతికి ఎమ్మెల్యేల సంఖ్య తగ్గితే అజిత్ పవార్ కింగ్ మేకర్ అవుతారని ప్రచారం జరుగుతోంది. సీఎం పదవిపై తనకు ఆసక్తి ఉందని అజిత్ పవార్ కూడా గతంలో ఓ సారి అన్నారు.

ఏపీ పీఏసీ కొత్త ఛైర్మన్ ఈయనే.. సభ్యులు ఎవరెవరంటే..