ప్రణబ్ కోలుకోవాలని మృత్యుంజయ హోమం

  • Published By: madhu ,Published On : August 13, 2020 / 06:31 AM IST
ప్రణబ్ కోలుకోవాలని మృత్యుంజయ హోమం

Updated On : August 13, 2020 / 7:13 AM IST

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోలుకోవాలని పూజలు నిర్వహిస్తున్నారు. ఆయన త్వరగా పూర్తిగా ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని కోరుతూ…ఆయన స్వగ్రామమైన బెంగాల్ లోని మిరిటీలో మృత్యుంజయ మంత్ర జపం నిర్వహస్తున్నారు. గత మూడు రోజులుగా పూజలు చేస్తున్నారు.

మరోవైపు ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆర్మీ ఆసుపత్రి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆసుపత్రిలో ప్రణబ్ 10వ తేదీన చేరిన సంగతి తెలిసిందే. ప్రణబ్ కు బ్రెయిన్ సర్జరీ జరిగిన తర్వాత..వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ప్రణబ్ కోలుకోవాలని ప్రముఖులు కోరుకుంటున్న సమయంలో ఆయన కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. గత సంవత్సరం ఆగస్టు 8. నా జీవితంలోని ఓ అత్యంత ఆనందకరమైన రోజు. సరిగ్గా సంవత్సరం క్రితం ఆయన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు.

ఏడాది తిరిగేసరికి ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఇక నా తండ్రి భారం ఆ దేవుడిదే. తనవంతుగా ఏం చేయాలో ఆ భగవంతుడు అన్నీ చేయాలి. జీవితంలో ఏర్పడే సంతోషాన్ని కష్టాలను సమానంగా స్వీకరించేలా నాకు బలాన్నివ్వాలి. మాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని ఆమె ట్వీట్ చేశారు.