Prashant Kishor : కాంగ్రెస్ లేకుండానే కొత్త కూటమి
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్.

Prashanth Kishore
Prashant Kishor : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్. కాంగ్రెస్ లేకపోయినా బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయవచ్చని తెలిపారాయణ. 1984 తర్వాత కాంగ్రెస్ ఒంటరిగా గెలవలేదని.. చిన్నాచితక పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
గత పదేళ్లలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిందని తెలిపారు. కాంగ్రెస్ పదేళ్ల చరిత్రను చూస్తే 90 శాతం వైఫల్యాలే కనిపిస్తున్నాయని ప్రశాంత్ అన్నారు. ఆ పార్టీకి బలమైన అధ్యక్షుడు కావాలని.. గాంధీ కుటుంబం తక్షణమే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటే పార్టీని బ్రతికించుకోవచ్చని వివరించారు. ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోతుందని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఇకనైనా శాశ్వత అధ్యక్షుడిని ప్రకటించాలని ప్రశాంత్ వ్యాఖ్యలు చేశారు.
చదవండి : Odisha Congress : విద్యార్థులపై విరిగిన లాఠీ..వెంబడించి మరీ కొట్టారు