పీవీకి భారతరత్న.. పురస్కారం అందుకున్న పీవీ కుమారుడు ప్రభాకర్‌ రావు

రాష్ట్రపతి భవన్ లో ఘనంగా భారతరత్న అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. పీవీ నర్సింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు

పీవీకి భారతరత్న.. పురస్కారం అందుకున్న పీవీ కుమారుడు ప్రభాకర్‌ రావు

Bharat Ratna Awards

Updated On : March 30, 2024 / 11:44 AM IST

Bharat Ratna Award To PV Narasimha Rao : మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు ఆయన మరణానంతరం కేంద్రం ఇటీవల భారతరత్న అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలతో పాటు  పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరందరి సమక్షంలో పీవీ నర్సింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. పీవీతో పాటు కర్పూరీ ఠాకూర్, చౌధురి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాలను అందజేశారు. అయితే,  మాజీ ఉపప్రధాని, బీజేపీ సీనియర్ నేత అద్వానీకి ఇంటికెళ్లి భారతరత్నను ప్రధానం చేయనున్నారు.

Also Read : Bharat Ratna 2024 : 61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజానికి ‘భారతరత్న’

దేశంలోని పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహనీయులు, ప్రముఖులకు భారతరత్న అవార్డులను కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్టు నాయకుడు కర్పూరి ఠాకూర్ , మాజీ ప్రధాని, దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరొందిన పివి నరసింహారావు, మాజీ ప్రధాని, వ్యవసాయ రంగం పటిష్టం చేసేందుకు కృషి చేసిన జాట్ నేతగా పేరొందిన చౌదరి చరణ్ సింగ్, దేశంలో వ్యవసాయ విప్లవ పితామహుడిగా పేరొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్ఎస్ స్వామినాథన్.. వీరికితోడు, మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్ కె అద్వానీకి కేంద్రం భారత రత్న అవార్డులను ప్రకటించింది. అద్వానీ మినహా.. మిగిలిన నలుగురు ప్రముఖుల కుటుంబ సభ్యులు రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులుమీదుగా భారత రత్న అవార్డులు అందుకున్నారు. అద్వానీకి రేపు అవార్డును ప్రదానం చేయనున్నారు. అద్వానీ నివాసానికి రాష్ట్రపతి, ప్రధాని, ఇతర నేతలు వెళ్లి ఆయనకు భారత రత్న అవార్డు ప్రదానం చేయనున్నారు.

Also Read : కాంగ్రెస్‌కు ఐటీ నోటీసు; బీజేపీ ట్యాక్స్ టెర్రరిజం పాలిటిక్స్ చేస్తోందన్న హస్తం పార్టీ