Bihar Women : మహిళలకు ఫ్రీ రైల్… టికెట్ అక్కర్లేదు.. మోదీ చెప్పారు.. ఈ మహిళలు చెప్పింది విని రైల్వే మేనేజర్ కే మైండ్ బ్లాంక్

మీరంతా అక్కడ ఏం చేస్తున్నారు అని అధికారి వారిని అడిగారు. ప్రయాగ్ రాజ్ వెళ్లే రైలు ఎక్కేందుకు తామంతా వేచి చూస్తున్నామని వారు చెప్పారు.

Bihar Women : మహిళలకు ఫ్రీ రైల్… టికెట్ అక్కర్లేదు.. మోదీ చెప్పారు.. ఈ మహిళలు చెప్పింది విని రైల్వే మేనేజర్ కే మైండ్ బ్లాంక్

Updated On : February 17, 2025 / 8:14 PM IST

Bihar Women : బీహార్ లోని ఓ సీనియర్ రైల్వే అధికారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు చెప్పిన మాటలు విని ఆయన కంగుతిన్నారు. ఇంతకీ వారు ఏమన్నారో తెలుసా… టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణించేందుకు ప్రధాని మోదీ తమకు అనుమతి ఇచ్చారని చెప్పారు. ఆ మాట విన్న రైల్వే అధికారి షాక్ కి గురయ్యారు. ఆ మహిళల మాటలు విన్న ఆయనకు నవ్వాలో, ఏడ్వాలో తెలియలేదు.

బక్సర్ రైల్వే స్టేషన్ లో దనపూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ జయంత్ కుమార్, కుంభమేళాకు వెళ్లే భక్తుల మధ్య జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు కిక్కిరిసిపోవడంతో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాటకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లలో తనిఖీలను ముమ్మరం చేశారు. సామర్ధ్యానికి మించి ఎక్కువ మంది ప్రయాణికులు రాకుండా చెకింగ్స్ చేస్తున్నారు.

Also Read : హైదరాబాద్ టు బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రేట్లపై TGSRTC డిస్కౌంట్

ఈ క్రమంలో రైల్వే స్టేషన్ లో ట్రాక్స్ లో దగ్గర అధికారికి ఓ గుంపు కనిపించింది. అందులో వేర్వేరు వయసులు ఉన్న మహిళలు ఉన్నారు. మీరంతా అక్కడ ఏం చేస్తున్నారు అని అధికారి వారిని అడిగారు. ప్రయాగ్ రాజ్ వెళ్లే రైలు ఎక్కేందుకు తామంతా వేచి చూస్తున్నామని వారు చెప్పారు. ఆ వెంటనే.. రైల్వే అధికారి.. మీ దగ్గర టికెట్లు ఉన్నాయాని అని అడిగారు. దీంతో వారు షాకింగ్ సమాధానం చెప్పారు.

టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణం చేసేందుకు మాకు అనుమతి ఉందన్నారు. ఆ వెంటనే.. ఆ అధికారి.. అలాంటి అనుమతి మీకు ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించారు. దానికి వారు.. వెంటనే.. ప్రధాని మోదీ మాకు అనుమతిచ్చారని సమాధానం ఇచ్చారు. వారు చెప్పింది విని రైల్వే స్టేషన్ మేనేజర్ విస్తుపోయారు. ఆయనకు మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. కాసేపటి వరకు ఆయన షాక్ లో ఉండిపోయారు. నోట మాట రాలేదు.

Also Read : అమితాబ్ బచ్చన్ అల్లుడి మీద చీటింగ్ కేసు..

దీనిపై డివిజనల్ రైల్వే మేనేజర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ”మీరు పొరబడ్డారు. ప్రధాని మోదీ కానీ, రైల్వే అధికారులు కానీ టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణం చేసేందుకు అనుమతి ఇవ్వలేదు. రైల్లో ప్రయాణం చేయాలంటే కచ్చితంగా టికెట్ కొని తీరాల్సిందే. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేయడం నేరం. మీకు ఫైన్ పడుతుంది’ అని ఆ మహిళల గుంపుతో చెప్పారు ఆ అధికారి.

కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటివరకు 50 కోట్ల మంది ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానం ఆచరించారని అధికారులు తెలిపారు. ఈ నెల 26వ తేదీన కుంభమేళా ముగియనుంది.