ప‌ట్టాల‌పై ప‌రుగులు :వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ కు ప్ర‌ధాని ప‌చ్చ‌జెండా

  • Published By: venkaiahnaidu ,Published On : February 15, 2019 / 07:14 AM IST
ప‌ట్టాల‌పై ప‌రుగులు :వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ కు ప్ర‌ధాని ప‌చ్చ‌జెండా

Updated On : February 15, 2019 / 7:14 AM IST

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ ప‌రిజ్ణానంతో త‌యారైన వందే భార‌త్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) ప‌ట్టాలెక్కింది. ఇవాళ‌(ఫిబ్ర‌వ‌రి-15,2019) ఉద‌యం ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప‌చ్చ‌ జెండా ఊపి వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ సేవ‌ల‌ను ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయ‌ల్, ఙ‌త‌ర స‌భ్యులతో క‌లిసి రైలు బోగీలోకి ఎక్కి సీట్లు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యానలు పరిశీలించారు. అనంతరం రైల్వే అధికారులతో మాట్లాడారు. వందేభారత్ వెళ్లే మార్గాలైన కాన్పూర్, అలహాబాద్ రైల్వేస్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రెండు రైల్వేస్టేషన్ల వద్ద 40 నిమిషాల పాటు రైలు ఆగనుంది.

ఈ రైలులో 16 ఏసీ బోగీలు, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలున్నాయి. దేశంలోనే అత్యంత వేగంగా రాకపోకలు సాగించే ఈ రైలులో 1128 మంది ప్రయాణికులు కూర్చొనేలా సీట్లున్నాయి.  రైలులో 16 ఏసీ బోగీలు, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలున్నాయి. ఢిల్లీ-వార‌ణాశిల మ‌ధ్య  రైలు ప‌రుగులు తీయ‌నుంది.753 కిలోమీటర్ల దూరం ప్రయాణం కేవలం 8 గంటల్లో చేరుకునఉంది.ఆదివారం(ఫిబ్ర‌వ‌రి-17,2019) నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభిస్తామని రైల్వే అధికారులు చెప్పారు. ఆటోమెటిక్ డోర్స్ సిస్టమ్, హట్‌స్పాట్, వైఫై, సౌకర్యవంతమైన సీట్లు, బయోవాక్యూమ్ టాయ్‌లెట్లు ఇలా ఎన్నో అధునాతన సౌకర్యాలు ఈ రైలులో ప్రయాణికులను ఆకరిస్తాయి.