Prithvi-II Missile Test Successfully : భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం..పృథ్వీ-II బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం

భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. భారత్ సరిహద్దు దేశాలు తోక జాడిస్తున్న క్రమంలో భారత్ క్షిపణుల పరీక్షల్లో సక్సెస్ అవుతూ..భారత్ దాయాది పాకిస్థాన్ తో పాటు చైనాకు కూడా చెక్ పెడుతోంది. ఈక్రమంలో మరో క్షిపణి ప్రయోగంలో భారత్ సక్సెస్ అయ్యింది. అదే ద గ్రేట్ ‘పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి’

Prithvi-II Missile Test Successfully : భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం..పృథ్వీ-II బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం

Prithvi-II Missile test successfully

Updated On : January 11, 2023 / 1:31 PM IST

Prithvi-II Missile test successfully : భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. భారత్ సరిహద్దు దేశాలు తోక జాడిస్తున్న క్రమంలో భారత్ క్షిపణుల పరీక్షల్లో సక్సెస్ అవుతూ..భారత్ దాయాది పాకిస్థాన్ తో పాటు చైనాకు కూడా చెక్ పెడుతోంది. ఈక్రమంలో మరో క్షిపణి ప్రయోగంలో భారత్ సక్సెస్ అయ్యింది. అదే ద గ్రేట్ ‘పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి’ (Prithvi-II Missile)ప్రయోగంలో విజయం సాధించింది.

దేశీయంగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని మంగళవారం (జనవరి 10,2023) రాత్రి ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. పృథ్వీ-2 క్షిపణి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ శాఖ తెలిపింది.

పృథ్వీ-2 ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించబడే బాలిస్టిక్ క్షిపణి అని..350 కి.మీ. రేంజ్‌లోని లక్ష్యాలను ఛేదిస్తుందని వెల్లడించింది. స్ట్రాప్ డౌన్ సీరియల్ నావిగేషన్ సిస్టమ్‌పై నడిచే ఈ క్షిపణి 500 కిలోల వరకు పేలు పదార్థాలను మోసుకెళ్లగలుగుతు దాదాపు 350 కిలోమీటర్ల రేంజ్ లోని టార్గెట్ ను ఛేధించగలదని వెల్లడించింది. ఈ క్షిపణి పరీక్ష సక్సెస్ కావటంతో భారత ఆర్మీలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. ఇలా శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకుంటున్న భారత్ తో ఇక కయ్యం పెట్టుకోవాలంటే సరిహద్దు దేశాలు వెనకడుగు వేయాల్సిందే.